ఎన్టీఆర్ 'బాద్‌షా' లో ఐటం సాంగ్ ఇదే...
హైదరాబాద్ : ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'బాద్‌షా'. ఈ చిత్రంలో ఓ ఐటం సాంగ్ ని భారీగా చిత్రీకరించటానికి ప్రత్యేకంగా సెట్ వేస్తున్నారు. ఆ ఐటం సాంగ్ లోని ఇలా సాగుతుంది. 'వెలకమ్ వెలకమ్ నా పేరు కనకం...'. ఈ పాట గతంలో దూకుడులో వచ్చిన ఐటం సాంగ్ తరహాలో పెద్దగా హిట్ అవుతుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు. ప్రేమ్ రక్షిత్ ఈ సాంగ్ ని కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఏప్రియల్ 5 న విడుదల కానున్న ఈ చిత్రంలో ఈ సాంగ్ హైలెట్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు.
బండ్ల గణేష్ ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ సినిమాగా 'బాద్‌షా'ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్, అన్నపూర్ణ ఏడెకరాలలో ఈ చిత్రం పాటను చిత్రీకరిస్తున్నారు. అందుకోసం భారీ సెట్‌ని నిర్మించారు. కళా దర్శకుడు ఎ.ఎస్.ప్రకాష్ నేతృత్వంలో రూపొందిన ఈ సెట్ కన్నుల పండువగా ఉందని నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
కలర్‌ఫుల్‌గా, బ్యూటిఫుల్‌గా, లావిష్‌గా ప్రకాష్ ఈ సెట్ తీర్చిదిద్దారని, దర్శకుని సృజనాత్మకతకు, కెమెరామెన్ నిశిత దృష్టికి తగ్గట్టుగా ఈ సెట్ ఉందని గణేష్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తమన్ అద్భుతమైన స్వరాలను అందిస్తే... దానికి తగ్గట్టుగా ప్రేమ్క్ష్రిత్ నృత్యరీతుల్ని సమకూర్చారని, రేపు 'బాద్‌షా' వసూళ్ల పరంగా వండర్స్ క్రియేట్ చేస్తుందని గణేష్ నమ్మకం వ్యక్తం చేశారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాణం: పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్.
''ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటూనే నా స్టైల్‌లో పూర్తి వినోదభరితంగా సినిమా ఉంటుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చిత్రణ, ఆయన లుక్ కొత్తగా ఉంటుంది. నందమూరి అభిమానులు పండుగ చేసుకునే సినిమా అవుతుంది'' అని శ్రీనువైట్ల చెప్పారు. తెలుగు చిత్రపరిశ్రమలోనే భారీ బడ్జెట్ చిత్రం ఇది. ఎన్టీఆర్, కాజల్‌లతో పాటు తెలుగు, తమిళ, హిందీ రంగాలకు చెందిన 50మందికి పైగా ప్రముఖ నటీనటులు ఇందులో నటిస్తున్నారు . ఆసక్తిగొలిపే కథ, కథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులోని యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ ప్రేక్షకుల్ని అద్భుతంగా ఎంటర్‌టైన్ చేస్తాయి. 'బాద్‌షా'గా ఓ కొత్త ఎన్టీఆర్‌ని చూస్తారు.


Click it and Unblock the Notifications











