రాజశేఖర్ మాస్ మసాలా.. అమ్మడితో యమ హాట్‌గా లొల్లి లొల్లి
'అ' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాను తెలుగు తెరకు పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా 'కల్కి'. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్న సందర్బంగా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం చిత్రంలోని ఐటెం సాంగ్ విడుదల చేయగా.. ఈ సాంగ్ యు ట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
గతంలో 'గరుడవేగ' చిత్రంలో డియో డియో అంటూ శృంగార తార సినీ లియోన్ తో స్టెప్పులేసిన రాజశేఖర్ తాజాగా విడుదలైన ఈ పాటలో ఐటెం భామతో లొల్లి లొల్లి చేశాడు. శ్రావణ్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ పాటను లలిత కావ్య ఆలపించగా కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. రిలిక్స్ అందరికీ అర్థమయ్యేలా చాలా సింపుల్‌గా, మంచి ఫాస్ట్ బీట్‌తో ఊపందుకుంది ఈ లిరికల్ సాంగ్. ''నీ లోడు బండి ఆపేయ్‌రా.. వేడి మీద ఇంజినుంది దించేయ్‌రా'' అంటూ లారీ బాబులను గుర్తుచేస్తూ మొదలైన పాట చాలా కొత్తగా అనిపిస్తుండటంతో.. మంచి కిక్ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ వేగంగా వ్యూస్ రాబడుతూ సినిమాపై హైప్ తెచ్చిపెట్టింది.

ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి' సినిమాలో రాజశేఖర్ హీరోగా నటించగా ఆయన సరసన అదాశర్మ, నందితా శ్వేత హీరోయిన్లుగా నటించారు. శివాని-శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. చిత్రంలో పూజిత పొన్నాడ, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధు జొన్నలగడ్డ, శత్రు, చరణ్‌దీప్, వేణుగోపాల్, వెన్నెల రామారావు, డి.ఎస్.రావు, అమిత్ శర్మ తదితరులు నటించారు. జూన్ 28న 'కల్కి' ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











