పెద్ద సినిమాలకు ధీటుగా తెలుగమ్మాయి స్పెషల్ సాంగ్...
'ఇప్పటి వరకు ఎనిమిది సినిమాలు నిర్మించాను. అన్ని సినిమాలు జనాదరణ పొందాయి. 'తెలుగమ్మాయి" చిత్రాన్ని కొత్త హీరోలతో నిర్మిస్తుంటే అందరూ కొత్తవారితో ఎందుకు చేస్తున్నారని వారించారు. ఫైనల్ అవుట్‌పుట్ చూసుకున్న తర్వాత నా జడ్జిమెంట్ కరెక్టే అని పించింది" అన్నారు చేగొండి హరిరామ జోగయ్య. ఆయన సారథ్యంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం 'తెలుగమ్మాయి".
సలోని ప్రధానపాత్రలో రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'తెలుగమ్మాయి'. ఇటీవలే దీని షూటింగ్ పూర్తిచేసుకుని, గుమ్మడికాయ కొట్టేసిన తరువాత చిత్రం యూనిట్ కి ఠక్కుమని ఓ ఐడియా వచ్చింది. మన సినిమాలో ఓ ఐటంసాంగ్ లేదే...అన్న సంగతి గుర్తొచ్చి, వెంటనే దానికి తగ్గా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఐటం సాంగ్ ని 'ఆర్తిపూరి' అనే కొత్తమ్మాయిపై చిత్రీకరించారు. ఈ సినిమాలోని పాటలకు అనంత్ శ్రీరాం సాహిత్యాన్ని అందించగా... వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ 'తెలుగమ్మాయి' చిత్రాన్ని జూన్ లో రిలీజ్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











