For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్విట్టర్ రివ్యూ: నరేష్ మూవీకి టాక్ ఏంటి? సినిమా హిట్టా ఫట్టా?

  |

  టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు అల్లరి నరేష్. కెరీర్ ఆరంభం నుంచీ కామెడీ చిత్రాలతో వచ్చిన ఈ టాలెంటెడ్ హీరో.. ఈ మధ్య కాలంలో పంథాను మార్చుకుని డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది 'నాంది'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఇక, ఇప్పుడు అల్లరి నరేష్ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అనే సినిమాతో వచ్చేశాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి!

  మారేడుమిల్లికి వెళ్లిన ఆఫీసర్

  మారేడుమిల్లికి వెళ్లిన ఆఫీసర్


  టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఏఆర్ మోహన్ తెరకెక్కించిన ఈ మూవీని హస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ నిర్మించారు. ఇందులో ఆనంది హీరోయిన్‌గా నటించింది. శ్రీచరణ్ పాకాల దీనికి సంగీతం అందించారు. ఇందులో ప్రవీణ్, వెన్నెల కిశోర్, సంపత్ రాజ్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు.

  హీరోయిన్ ప్రణిత బెడ్‌రూం పిక్స్ వైరల్: టాప్ తీసేసి.. అతడిపై వాలిపోయి!

   అలాంటి స్టోరీ... అన్నీ కలిపే

  అలాంటి స్టోరీ... అన్నీ కలిపే


  గోదావరి జిల్లాలోని మారేడుమిల్లికి ఎలక్షన్ ఆఫీసర్‌గా వెళ్లిన ఓ టీచర్.. అక్కడి వాళ్లు ఎదుర్కొంటోన్న సమస్యలపై ఎలాంటి పోరాటం చేశాడు? ఈ క్రమంలోనే ఎవరితో యుద్దానికి సిద్ధం అయ్యాడు? ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అనే అంశాలతో 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీ తెరకెక్కింది. ఇందులో ఫన్‌తో పాటు ఎమోషన్‌ను కూడా చూపించారు.

  ట్విట్టర్‌లో మూవీకి టాక్ ఇలా

  ట్విట్టర్‌లో మూవీకి టాక్ ఇలా


  నరేష్ నటించిన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీ ఎన్నో అంచనాల నడుమ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా ఏరియాల్లో ఈ సినిమా షోలు పడ్డాయి. దీంతో ట్విట్టర్ వేదికగా చాలా మంది ఈ సినిమాపై తమ అభిప్రాయాలు చెప్తున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. నెటిజన్ల నుంచి మాత్రం ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.

  జాకెట్ తీసేసిన జబర్ధస్త్ వర్ష: హాట్ షోలో గీత దాటేసి మరీ రచ్చ

   ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ అలా

  ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ అలా


  'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం పాత్రల పరిచయం, ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లేందుకు కొంత టైమ్ తీసుకున్నారట. ఇంటర్వెల్ గ్రిప్పింగ్‌గా ఉంటుందని తెలిసింది. కానీ, సెకెండాఫ్ మాత్రం చాలా ఎమోషనల్‌గా సాగుతుందట. అంతేకాదు, ప్రీ క్లైమాక్స్ వరకూ సాగదీసినట్లుగా ఉంటుందని అంటున్నారు. మళ్లీ క్లైమాక్స్ బాగుందని టాక్.

   సినిమాలో ప్లస్‌.. మైనస్‌ ఇవే

  సినిమాలో ప్లస్‌.. మైనస్‌ ఇవే


  'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఇందులో అల్లరి నరేష్ నటన, ఎమోషనల్ సీన్స్, కామెడీ, విజువల్స్, స్టోరీ లైన్ ఈ సినిమాకు ప్లస్ అంటున్నారు. అయితే, సెకెండాఫ్ కొంచెం సాగదీసినట్లుగా ఉండడం, లాజిక్ లేని సన్నివేశాలు, మ్యూజిక్, అక్కడక్కడా వీఎఫ్ఎక్స్ లోపం ఈ చిత్రానికి మైనస్‌గా మారాయని చెబుతున్నారు.

  బీచ్‌లో అందాల తెర తీసేసిన శ్రీముఖి: అక్కడ ఆకును అడ్డుగా పెట్టి మరీ!

   మొత్తంగా మూవీ ఎలా ఉంది?

  మొత్తంగా మూవీ ఎలా ఉంది?


  ట్విట్టర్ ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. అల్లరి నరేష్ నటించిన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీ ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందట. మరీ ముఖ్యంగా ఇందులో అటవీ ప్రాంత ప్రజల సమస్యలను ప్రస్తావించిన తీరు బాగుందని అంటున్నారు. చిత్ర యూనిట్ మంచి ప్రయత్నంతో వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల వాళ్లనూ అలరిస్తుందని టాక్.

  ఆ సినిమాకు రీమేక్ అంటూ

  ఆ సినిమాకు రీమేక్ అంటూ


  ఇప్పటి వరకూ అందుతోన్న సమాచారం ప్రకారం.. అల్లరి నరేష్ నటించిన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీకి మంచి టాక్ వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం బాలీవుడ్‌లో వచ్చిన 'న్యూటన్'కు రీమేక్‌గా వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కొందరు ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ఇప్పుడీ న్యూస్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

  మళ్లీ రెచ్చిపోయిన రీతూ చౌదరి: ఎద అందాలు కనిపించేలా హాట్ షో

  బుకింగ్స్ సూపర్.. ఓపెనింగ్స్

  బుకింగ్స్ సూపర్.. ఓపెనింగ్స్


  టాలెంటెడ్ స్టార్ అల్లరి నరేష్ నటించిన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీపై బజ్ పెద్దగా లేదనే చెప్పుకోవాలి. అయినప్పటికీ ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్ బాగున్నాయని తెలిసింది. మొదటి రోజు అల్లరి నరేష్ నటించిన ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 26 లక్షలకు పైగానే గ్రాస్‌ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

  English summary
  Tollywood Talented Hero Allari Naresh Did Itlu Maredumilli Prajaneekam Movie Under A.R. Mohan Direction. Lets See This Movie Twitter Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X