నాగ చైతన్య-సమంత
నాగ చైతన్య, సమంత ‘ఏ మాయ చేసేవే' సినిమాలో తొలిసారి కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత ఇద్దరూ కలిసి పలు చిత్రాల్లోనటించారు. ఈ క్రమంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది.
మనం సమయంలో లవ్ ప్రపోజల్..
నాగ చైతన్య, సమంత మధ్య ‘మనం' సినిమా సమయంలో సాన్నిహిత్యం మరింత పెరిగిందని, ఆ సమయంలో ఒకరి ప్రేమను ఒకరు వ్యక్త పరుచుకున్నారని టాక్.
హింట్ ఇచ్చిన సమంత
ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంత త్వరలో వివాహం చేసుకుని సెటిలవ్వబోతున్నట్లు వెల్లడించింది. అయితే చైతన్య పేరు మాత్రం బయట పెట్టలేదు.
మౌనం అంగీకారమే..
అయితే సమంత, నాగ చైతన్య కలిసి ఏకాంతంగా గడిపిన వీడియో బయటకు రావడం, మీడియాలో ఈ విషయమై చాలా ప్రచారం జరుగుతున్నా ఇద్దరూ ఎలాంటి ఖండన చేయకుండా మౌనంగా ఉండటంతో.... విషయం అందరికీ అర్థమైంది.
అఖిల్
అఖిల్ ప్రేమలో పడ్డట్లు, ఎంగేజ్మెంట్ అయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై అఖిల్ స్పందిస్తూ ప్రేమలో పడ్డ మాట వాస్తవమే కానీ...ఎంగేజ్మెంట్ కాలేదని ఒప్పుకున్నాడు.
శ్రీయ భూపాల్
అఖిల్ అలా ప్రేమ విషయం ఒప్పుకోగానే... ప్రేమించే అమ్మాయి శ్రీయ భూపాల్ అనే విషయం లీకైంది. ఆమె హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ శాలిని భూపాల్ కూతురు. ఈ అమ్మాయి అమెరికా న్యూయార్కులోని ‘పార్సన్స్ స్కూల్ ఆప్ డిజైన్' డిజైనింగ్ కోర్సు చేసిందట.
నాగార్జున
ఇటీవల నాగార్జున కూడా స్పందిస్తూ... తన ఇద్దరు కుమారులు తమ జీవిత భాగస్వామిని ఎంచుకోవడం ఆనందంగా ఉంది అని వ్యాఖ్యానించడం ద్వారా నాగార్జున కూడా వీరిద్దరి లవ్ మ్యాటర్ పరోక్షంగా ఒప్పుకున్నట్లయింది.
డిసెంబర్లో వివాహం
నాగ చైతన్య, అఖిల్ వివాహాలు ఒకేసారి డిసెంబర్లో చేసేందుకు నాగార్జున ప్లాన్ చేస్తున్నారట.