twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'వెట్ సెక్సీ సాంగ్' అంటూ రామ్ చరణ్

    By Srikanya
    |

    వానా వానా వెల్లువాయే పాట ఫస్ట్ డే షూట్ పూర్తైంది. ఈ పాట చాలా టెర్రిఫిక్ గా ఉంటుందని చెప్పుగలను. మీరందరూ ఈ పాటను తెరపై చూసి ఆనందరిస్తారు. ఇట్స్ ఫ్రీజింగ్ వెట్ సెక్సీ సాంగ్. మశాలా చాయ్ తీసుకుని, మా డాడీ మెమరీస్ ను గుర్తుచేసుకుంటుంటే చాలా ఎమేజింగ్ గా ఉంది అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేసారు.ఆయన గ్యాంగ్ లీడర్ లో తన తండ్రి చిరంజీవి చేసిన వానా వానా వెల్లువాయే పాటను తన చిత్రం రచ్చలో రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాటను ఆదివారం ఉదయం నుంచి అన్నపూర్ణ స్టూడియోలో వేసిన స్పెషల్ సెట్ లో చిత్రీకరిస్తున్నారు. అప్పట్లో చిరంజీవి, విజయశాంతి వర్షంలో చేసిన డాన్స్ లను మరిపించే విధంగా ఈ సాంగ్ ని షూట్ చేస్తున్నట్లు చెప్తున్నారు. గతంలోనూ మగధీర చిత్రంలో బంగారు కోడి పెట్ట పాటను రీమిక్స్ చేసి సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ పాటకు, శోభి కొరియోగ్రపిని సమకూరుస్తున్నారు.

    ఇక రచ్చ గురించి చెపుతూ.. నేను చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నాను.. అలాంటి పాత్రను నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. నా ఫ్యాన్స్ నానుంచి ఎలాంటి సినిమా ఎక్సపెక్ట్ చేస్తారో ఖచ్చితంగా అలాంటిదే ఇది. ఈ స్క్రిప్టుని సంపత్ నంది చాలా జాగ్రత్తగా వర్క్ చేసి తెరకెక్కిస్తున్నారు. అతను చాలా ప్రతిభావంతంగా పనిచేస్తున్నాడు అన్నారు. ఇక రచ్చ చిత్రాన్ని పిబ్రవరి 20న విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.

    English summary
    Ram Charan tweets... Just wrapped first day shoot of Vana vana songs from GL. I must say Its looking terrific. U guys will love it on screen. Its a freezing wet sexy song... Havin lots hot masala chai's and re-living dad's memories. Feels amazing.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X