త్రివిక్రమ్‌తో ఢీ అంటే ఢీ- అదే రాజమౌళి మైనస్!
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకే రోజు ఢీ అంటే ఢీ అనబోతున్నారు. కొంప తీసి వీళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ గొడవలు ఉన్నాయనుకోవద్దు. ఈ ఇద్దరు దర్శకత్వం వహించిన చిత్రాలు 'ఈగ', 'జులాయి' చిత్రాలు రెండూ ఒకే రోజు జులై 6న విడుదలవుతున్నాయి. మరి ఇద్దరిలో ఎవరిది ఆ రోజు పైచేయి అవుతుంది? అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది.
చాలా కాలం నుంచి వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న రాజమౌళి 'ఈగ' చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధం అవుతోంది. ఈగ చిత్రం ఇంత లేటు కావడానికి గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాక పోవడంతో పాటు.... జూ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, బాలయ్య లాంటి పెద్ద హీరోలతో పోటీ పడటం ఇష్టం లేకనే వాయిదా వేశారని వాదన కూడా ఉంది. తాజాగా బన్నీ-త్రివిక్రమ్ 'జులాయి' చిత్రం 'ఈగ'కు పోటీగా మారడంతో...రాజమౌళిలో ఏదో తెలియని ఆందోళన నెలకొందట.
స్టోరీని ముందే చెప్పేయడం, సినిమా ఆలస్యం చేయడంతో 'ఈగ' చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గి పోతోంది. హీరో ఉండేది ఎలాగూ పావుగంటే కాబట్టి కేవలం గ్రాఫిక్స్ చూడటం కోసమే సినిమాకు వెళ్లాలి అనే భావనతో చాలా మంది డిస్సప్పాయింట్ గా ఉన్నారు. పైగా చిత్రం స్టోరీలైన్ బట్టి కామెడీ అంశాలు కూడా తక్కువే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా వెళితే ఎంజాయ్ చేయగలమా? అనే సందేహం సగటు ప్రేక్షకుడిలో నెలకొంది.
'జులాయి' చిత్రం విషయానికొస్తే...చాలా ప్లస్సులు కనిపిస్తున్నాయి. కథ బలంగా లేకున్నా స్క్రీన్ ప్లే, పంచ్ డైలాగులతో సినిమాను నెగ్గుకురాగల సత్తా ఉన్న దర్శకుడు త్రివిక్రమ్. అఫ్ కోర్స్ రాజమౌళి కూడా ఆ విషయంలో తక్కువేమీ కాదు. కానీ ప్రస్తుతం ఈ ఇద్దరి సినిమా కథాంశాలు, నేపథ్యాలు వేర్వేరు. రాజమౌళి కథ ముందే చెప్పేసి కేవలం గ్రాఫిక్స్‌పై నమ్మకంతో ఉన్నాడు. త్రివిక్రమ్ యూత్, మాస్, ఫ్యామిలీని ఆకట్టుకునే మసాలాతో రంగంలోకి దిగుతున్నాడు. ఇక ఇలియానా గ్లామర్ షో సరేసరి. ఈ నేపథ్యంలో సక్సెస్ రేటు ఏ సినిమాకు ఎక్కవుగా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











