‘ఇట్స్ మై లవ్ స్టోరీ’కి మరో.. 30
అరవింద్, నిఖిత జంటగా స్నేహగీతం ఫేం మధుర శ్రీధర్ రూపొందించిన 'ఇట్స్ మై లవ్ స్టోరీ" సినిమా ప్రదర్శించే థియేటర్ల సంఖ్య మరో 30 పెంచామని సినిమా దర్శక నిర్మాతలు మంగళవారం ప్రకటించారు. దీనిపై దర్శకుడు మాట్లాడుతూ ఎలాంటి హైప్స్ లేకుండా కేవలం కథనే నమ్ముకుని కొత్త వారితో రూపొందించిన ఇట్స్ మై లవ్ స్టోరీ విడుదలై ప్రేక్షకుల నీరాజనాలు అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో... డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ఎలాంటి చిత్రాలను ఆశిస్తున్నారో మాకు స్పష్టంగా అర్థమైంది. అలా మొదలైంది సినిమా తర్వాత చిన్న సినిమాల్లో నాలుగు రూపాయలు సంపాదించుకున్నామని ఎగ్జిబిటర్స్ అంటుంటే చాలా సంతోషమేయడమే కాకుండా ఇంకా మా బాధ్యత పెంచిందన్నారు.
అందరికీ ఇంత బాగా చేరువైన ఈ చిత్రాన్ని విడుదల చేసిన మా కో ప్రొడ్యూసర్స్ మల్టీ డైమన్షన్ వారు రేపటి నుంచి మరో 30 థియేటర్లు పెంచనున్నారు. ఇంత ఘన విజయం సాధించిన ప్రేక్షకులకు ధాంక్స్ అన్నారు. ఈ సినిమాకు మంచి రెస్సాన్స్ వస్తుండటం సంతోషంగా ఉందని హీరో అరవింద్ అంటే...ఫేస్ బుక్లో రూ. లక్ష జీతం వదులుకుని మొదట్లో తప్పు చేశానేమోనని భయపడ్డా, సక్సెస్ టూర్ లో ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే నా భయం పటాపంచలైంది. నేను పోషించిన వందన క్యారెక్టర్ ప్రతి ఒక్కరికీ చేరువైంది. ఇది యూత్ సినిమా మాత్రమే కాదు, కుటుంబం మొత్తం కలిసి చూడాల్సిన సినిమా అని నిఖిత పేర్కొంది.


Click it and Unblock the Notifications











