'ఇట్స్ మై లవ్‌ స్టోరీ' యూనిట్ ప్రేమయాత్ర

By Bojja Kumar

స్నేహ గీతం ఫేం మధుర శ్రీధర్ దర్శకత్వంలో 'ఇట్స్ మై లవ్‌స్టోరీ' చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. అరవింద్, నిఖిత జంటగా నటించారు. ఈ చిత్ర యూనిట్ సభ్యలు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రేమ యాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రేక్షకులను కలసుకోవడం కోసం యూనిట్ సభ్యులు గురువారం నుంచే ఈ యాత్ర ప్రారంభించారు.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీధర్ మాట్లాడుతూ 'సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఆంధ్రా, నైజాం ప్రాంతాల్లో పర్యటించి, వచ్చేవారం రాయలసీమ వెళతాం. సాఫ్ట్‌వేర్ రంగం నుంచి వచ్చిన నేను, ఫారిన్‌లో ఎంబిఎ చేసి వచ్చిన అరవింద్, ఫేస్‌బుక్‌లో నెలకు లక్షరూపాయల జాబ్ వదులుకొని వచ్చిన నికితను అభినందిస్తూ చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ టిప్స్ అడుగుతున్నారు. అందుకే ఈ ప్రేమయాత్రలో భాగంగా ఇంజనీరింగ్ కాలేజిలను సందర్శించనున్నాం' అన్నారు.

మల్టీ డైమన్షియల్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో షిరిడీ సాయి కంబైన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ, నిఖిత నారాయణ్, జయసుధ, శరత్ బాబు, కాశీ విశ్వనాథ్‌, ప్రగతి, తాగు బోతు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X