అలా చేయాలంటే గట్స్ ఉండాలి: జయసుధ
సహజ నటిగా తెలుగు తెరను ఏలిన ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతూనే మరో వైపు సినిమాల్లోనూ రాణిస్తున్న జయసుధ...రాజకీయాల్లోకి వచ్చినందుకు బాధ పడుతోంది. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ...''నేను రాజకీయాల్లోకి వచ్చి సాధించిందేం లేదు. సమాజ సేవ చేద్దామని చిత్తసుద్ధితో వచ్చినా..ఇక్కడ ఎన్నో క్లిష్టపరిస్థితులు ఎదుర్కొన్నా. ఓ పనిచేద్దామంటే ఎన్నిటినో దాటాల్సి వచ్చేది. ప్రజల జీవనశైలి మార్చాలని, పారిశుధ్యం విషయంలో కనీసం నా నియోజ కవర్గం సికిందరా బాద్లోనైనా మార్పు తేవాలని తపించినా కుదరలేదు. క్రమేణా సినిమా అవకాశాలు రావడంతో రాజకీయాలపై ఆసక్తి కూడా సన్నగిల్లింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నా"" అన్నారు.
ప్రస్తుతం ఆమె నటించిన ఇట్స్ మై లవ్ స్టోరీ విడుదలకు సిద్ధమైంది. దీని గురించి మాట్లాడుతూ...'' మంచి సినిమా తీయడానికి దర్శకుడిలో గట్స్ ఉండాలి. రొటీన్ మూస కథల నుంచి బైటికొచ్చి మధురశ్రీధర్ గట్స్‌తో ఈ చిత్రాన్ని తీశారు. సహజసిద్ధత ఉన్న పాత్రలు, చక్కని కథనం-సంగీతం, ఆకట్టుకునే యువజంట తన సినిమాకి అస్సెట్స్"" అన్నారు . 'చాలా ఏళ్ల తర్వాత సీనియర్ నటుడు శరత్‌బాబు, నేను భార్యభర్తలుగా నటించాం. మేం కథానాయిక తల్లిదండ్రులుగా కనిపిస్తాం. ఓ కూతురితో తల్లి ఎలా మాట్లాడుతుందో..ఎలా నడుచుకుంటుందో అలా సహజంగా నా పాత్ర ఉంటుంది. సన్నివేశాలు నిజసంఘటనల్లా అనిపిస్తాయి. సిల్లీ..అనిపించే పాత్రలేవీ సినిమాలో ఉండవన్నారు. మల్టీ డైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో షిరిడిసా యి కంబైన్స్ పతాకంపై ఎం.వి.కె.రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. 11.11.11న ఈ సినిమా రిలీజవుతోంది.


Click it and Unblock the Notifications












