ఈ వయసులో లవ్ స్టోరీస్ కష్టమే : వెంకటేష్
ఈ వయసులో నన్ను లవర్ బాయ్ గా చూపించడం కష్టమే..కానీ దర్శకుడు గోపీచంద్ మలినేని చాలా బాగా హ్యాండిల్ చేశాడని చెప్పుకొచ్చారు విక్టరీ వెంకటేష్. ఈ నెల 14న తన తాజా సినిమా 'బాడీగార్డ్' విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...గతంలో గోపీ దర్శకత్వం వహించిన 'డాన్ శీను' చిత్రం చూశాను. స్క్రిప్టును చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఆ నమ్మకంతోనే ఆయన దర్శకత్వంలో 'బాడీగార్డ్'కు ఒప్పుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు వెంకీ.
బాడీగార్డు చిత్రం పూర్తి వినోదాత్మకంగా కంప్లీట్ ఫ్యామిలీ చూసి ఆనందించే రీతిలో ఉంటుందని....ప్రేక్షకులు కోరుకుంటున్న అన్ని అంశాలు ఇందులో ఉంటాయని అన్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. అభిమానులకు అన్ని విధాలా సంతృప్తిని కలిగిస్తుందనే నమ్మకం ఉందన్నారు.
బెల్లకొండ సురేష్ నిర్మిస్తున్న ఈచిత్రంలో వెంకటేస్ సరసన త్రిష నటిస్తోంది. తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే బాడీగార్డ్ మలయాళం, హిందీ బాషల్లో నిర్మితం అయిన భారీ విజయం అందుకున్నాయి. వెంకటేష్ నటించిన తెలుగు వెర్షన్ కూడా సంక్రాంతి పండగకు కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయం అనే వార్తలు ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











