పవన్ టైటిల్ 'పులి' కాదు...మరి

By Staff

Pawan Kalyan
పవన్ కళ్యాణ్,ఎస్.జె.సూర్య కాంబినేషన్ లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం టైటిల్ 'పులి' కాదని విశ్వసనీయంగా తెలుస్తోంది. అదే విషయాన్ని పవన్ ఓ మీటింగ్ లో ప్రస్తావిస్తూ పులి కాదనీ 'కుమరం పులి' అని చెప్పాడని అంతా అంటున్నారు. అలాగే ఈ చిత్రంలో పవన్ ఆరాధించే చేగువేరా జీవిత చరిత్రలోనీ కొన్ని అంశాలను తీసుకుని కథనంలో ఇమిడ్చారనీ చెప్తున్నారు.


ఇక ఈ చిత్రం పవన్ లోపలి అభ్యుదయ భావజాలానికి,బయిట ఎదుర్కొనే ప్రపంచానికి జరిగే సంఘర్షణగా కూడాఉండే అవకాశం ఉంటుందంటున్నారు. అలాగే పవన్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గానే కాక మరో పాత్రలోనూ విభిన్నంగా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. అది నిజం కాకపోవచ్చునని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్ సత్యాగ్రహి లో చర్చిస్తారనుకున్న అంశాలకు అధిక ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలోనీ యాక్షన్ సీక్వెన్స్ లను రీసెంట్ గా అల్యూమినియం ఫ్యాక్టరీలో నలభైమంది పైగా ఫైటర్స్ తో తీసారనీ,ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ సినిమాలో ఉపయోగించారు. పూర్తి స్ధాయి షూటింగ్ అన్ని పనులు మార్చి కి పూర్తి చేసి ఏప్రియల్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X