ఎన్టీఆర్ బయోపిక్: అద్భుతమైన వ్యక్తి కోసం రంగంలోకి దూకుతున్నా.. చంద్రబాబు నేనే అంటూ.. రానా!
Recommended Video

ఎన్టీఆర్ బయోపిక్ పై రోజు రోజుకు అంచనాలు పెరుగిపోతున్నాయి. ఎన్టీఆర్ జీవితం గురించి తెలుగు ప్రజలందరికి తెలిసిందే. ఆయన జీవితాన్ని వెండి తెరపై ఎలా చూపించబోతున్నారు. తండ్రి పాత్రలో బాలయ్య ఎలా నటిస్తాడు అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ క్రమంలో క్రేజీ నటులంతా ఎన్టీఆర్ బయోపిక్ లో భాగం కాబోతున్నారు. విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో నటిస్తోంది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ రాజకీయ జీవితం కూడా కీలక వ్యక్తులతో ముడిపడి ఉంది.ఆ దిశగా దగ్గుబాటి రాజా ఆసక్తికర ప్రకటన చేశాడు.

ఎన్టీఆర్ బయోపిక్
బాహుబలి తరువాత రానా క్రేజీ హీరోగా మారిపోయాడు. గత కొంత కాలంగా రానా ఎన్టీఆర్ బయోపిక్ లో కీలక పాత్ర పోషించబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా తాను ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్న విషయాన్ని రానా ధృవీకరించాడు.
అద్భుతమైన వ్యక్తి కోసం
ట్విట్టర్ వేదికగా రానా తాను ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్నట్లు ప్రకటించాడు. అద్భుతమైన వ్యక్తి ఎన్టీఆర్ కోసం తాను కూడా చేతులు కలుపుతున్నా అని రానా తెలిపాడు. ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్, బాలయ్యతో ఉన్న ఫోటోని షేర్ చేశాడు.

నేనే చంద్రబాబు
ఎన్టీఆర్ బైపిక్ లో చంద్రబాబు పాత్రలో రానా నటించబోతున్నాడు. ఈ ప్రకటన ద్వారా రానా ఈ విషయాన్ని చెప్పకనే చెప్పాడు. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో అనేక ఒడుదుడుకులు ఎదురయ్యాయి. వీటన్నింటిలో చంద్రబాబు పాత్రని ఎలా చూపిస్తారు అనే ఆసక్తినెలకొని ఉంది.

ఇంకా ఎవరెవరు
కేవలం చంద్రబాబు పాత్ర మాత్రమే కాదు. ఎన్టీఆర్ సినీ రాజకీయా జీవితంలో చాలామంది కీలక వ్యక్తులు ఉన్నారు. ఎవరెవరి పాత్రాలు చూపించబోతున్నారు. ఆ పాత్రల్లో ఏ నటుల్ని తీసుకోబోతున్నారో తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











