ఎన్టీఆర్, రాంచరణ్ మీడియా ముందుకు.. 'RRR' తెరవెనుక ఏం జరుగుతోంది!

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. డివివి దానయ్య ఈ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కస్తున్నారు. రాంచరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారనే విషయం తప్ప రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించి ఇంకే సమాచారం అందించలేదు. ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మొత్తం ఊహాగానాలే. మార్చి 14న ఆర్ఆర్ఆర్ టీం మీడియా ముందుకు రాబోతున్నట్లు సడెన్‌గా ప్రకటన రావడం ఆసక్తిగా మారింది.

మీడియా సమావేశం

మీడియా సమావేశం

రాజమౌళి త్వరలో ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి మాట్లాడేందుకు మీడియా సమావేశంలో పాల్గొనబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమయ్యాయి. కేవలం రాజమౌళి మాత్రమే కాదు.. రాంచరణ్, ఎన్టీఆర్ సహా ఆర్ఆర్ఆర్ టీం మొత్తం మార్చి 14న మీడియా సమావేశంలో పాల్గొనబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వీళ్లంతా ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ఎలాంటి విషయాలు ప్రకటిస్తారో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

క్లారిటీ ఇస్తాడా

ఆర్ఆర్ఆర్ కథ గురించి రాజమౌళి ఇంత వరకు చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. షూటింగ్ లొకేషన్స్ లో స్టిల్స్, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ చిత్రం స్వాతంత్ర సమరం నేపథ్యంలో సాగుతుందని వార్తలు వస్తున్నాయి. రాంచరణ్ బ్రిటిష్ పోలీస్ అధికారికగా, ఎన్టీఆర్ అడవిదొంగగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథ, చరణ్, ఎన్టీఆర్ పాత్రలు విషయంలో రాజమౌళి క్లారిటీ ఇస్తాడేమో వేచి చూడాలి.

హీరోయిన్లు

హీరోయిన్లు

ఆర్ఆర్ఆర్ చిత్రం విషయంలో ఆసక్తి రేపుతున్న మరో అంశం హీరోయిన్లు ఎవరు.. విలన్ ఎవరు.. ఇప్పటికే రాజమౌళి బాలీవుడ్ హీరోయిన్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విలన్ పాత్ర గురించి ఇంతవరకు ఎలాంటి వార్తలు రాలేదు. ఈ విషయాలపై కూడా రాజమౌళి స్పందించాలని అభిమానులు ఆశిస్తున్నారు. కేవలం సినిమా వివరాలు మాత్రమే తెలియజేస్తాడా లేక జక్కన్న ఇంకేమైనా సర్ ప్రైజ్ ఇస్తాడా అనేది వేచి చూడాలి.

డివివి దానయ్య నిర్మాణంలో

డివివి దానయ్య నిర్మాణంలో

బాహుబలి చిత్రం తర్వాత రాజమౌళి అంతకంటే పెద్ద భాద్యత స్వీకరించాడు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని దానయ్య 300 కోట్ల బడ్జెట్ లో రూపొందిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2020లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X