పవన్ కళ్యాణ్ వర్సెస్ మహేష్ బాబు....అంటూ ప్రచారం
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో టాప్ పొజిషన్లో ఉన్న హీరోలు ఇద్దరే ఇద్దరు. టాలీవుడ్ పరిశ్రమకు సంబంధించి నెం.1 స్థానం వీరిలో ఎవరిది అనే అంశంపై చాలా కాలంగా తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఇద్దరు తమకు నెంబర్ గేమ్ మీద ఆసక్తి లేదని పలు సందర్బాల్లో తేల్చి చెప్పినప్పటికీ....అభిమానులు మాత్రం ఎవరికి వారు తమ తమ హీరోలను గొప్పగా చెప్పుకుంటున్నారు.
సాధారణంగా ఈ ఇద్దరి స్టార్లలో ఎవరి సినిమా విడుదలైనా....హడావుడి, ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ ఓ రేంజిలో ఉంటుంది. ఈ ఇద్దరు హీరోలకు సంబంధించిన సినిమాలేమైనా విడుదలైతే ఇతర సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు భయపడే పరిస్థితి ఉందంటే వీరికున్నక్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

అదే ఈ ఇద్దరి సినిమాలు పోటీ పోటీగా ఒకేసారి విడుదలైతే బాక్సాఫీసు పరిస్థితి, థియేటర్లకు అభిమానుల తాకిడి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. అందులో పండగ సీజన్, హాలీడే సీజన్ అయితే చెప్పనవసరం లేదు. రాబోయే 2016 సంక్రాంతికి మనం ఇలాంటి పరిస్థితే చూడబోతున్నాం.
పవన్ కళ్యాణ్ నటించబోయే ‘గబ్బర్ సింగ్-2' చిత్రం త్వరలో ప్రారంభం కాబోతోంది. దీన్ని సాంక్రాంతి నాటికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు నటించబోతున్న బ్రహ్మోత్సవం కూడా ఈ నెలాఖరున ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో వచ్చే సంక్రాంతికి పవన్ కళ్యాణ్ వర్సెస్ మహేష్ బాబు బాక్సాఫీసు ఫైట్ జరుగబోతోందనే ప్రచారం సినీ సర్కిల్ లో మొదలైంది.


Click it and Unblock the Notifications











