దయచేసి అలా చేయొద్దు: బాహుబలి-కట్టప్ప ప్రస్తావనతో షారుక్ విన్నపం!
‘ఇత్తెఫాఖ్’ మూవీ రిలీజ్ సందర్భంగా ఆ చిత్ర నిర్మాత షారుక్ ఓ వీడియో విడుదల చేశారు. సినిమా స్పాయిలర్లకు దూరంగా ఉండాలని, ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరారు.
సినిమాలో ఉండే థ్రిల్లింగ్, సస్పెన్స్ అంశాలే ప్రేక్షకులను చివరి వరకు సీట్లో కూర్చునేలా చేస్తుంది. సినిమాలో జరిగే విషయాలు ముందే తెలిస్తే అసలు మజా ఉండదు. ఒకప్పుడు సోషల్ మీడియా లేని రోజుల్లో సినిమాను బాగా ఎంజాయ్ చేసేవారు. అయితే ఇంటర్నెట్, సోషల్ మీడియా విస్తరించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
రిలీజ్ అయిన వెంటనే కొన్ని గంటల్లో సినిమాలో ఏముంది? సస్పెన్స్, ట్విస్ట్ ఏమిటనే అనే అంశాల వేగంగా బయటకు తెలిసి పోతున్నాయి. దీంతో చాలా మంది ప్రేక్షకలు థ్రిల్ మిస్సయి సినిమాలోని మజాను ఎంజాయ్ చేయలేకపోతున్నారు.
షారుక్ ఖాన్ నిర్మాతగా ‘ఇత్తెఫాఖ్’
తాజాగా షారుక్ ఖాన్ నిర్మాతగా అభయ్ చోప్రా దర్శకత్వంలో సిద్దార్థ్ మల్హోత్రా, అక్షయ్ ఖన్నా, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఇత్తెఫాఖ్' మూవీ నవంబర్ 3న విడుదలవుతోంది. సినిమా విడుదల నేపథ్యంలో షారుక్ ఖాన్ ఓ వీడియో విడుదల చేశారు.

సినిమా స్పాయిలర్లకు దూరంగా
ఈ వీడియోలో షారుక్ మాట్లాడుతూ... సినిమా స్పాయిలర్లకు దూరంగా ఉండాలని, సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని, సినిమా చూసిన తర్వాత కూడా అందులో ఉండే థ్రిల్లింగ్ సస్పెన్స్ అంశాలను గురించి చర్చించ వద్దని, దాని వల్ల ఆ సినిమా చూసే వారు థ్రిల్ మిస్సవుతారని షారుక్ ఖాన్ అన్నారు.

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ముందే తెలిస్తే ఎలా?
ఉదాహరణకు బాహుబలి2 సినిమా చూడక ముందే....‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయం ముందు తెలిస్తే' సినిమాలో మజా మిస్సయిపోతాం. అందుకే ఇలాంటి చేయొద్దని షారుక్ విన్నవించారు.

ఇత్తెఫాఖ్
‘ఇత్తెఫాఖ్' చిత్రానికి అభయ్ చోప్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని షారుక్ ఖాన్, కరణ్ జోహార్, గౌరీ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్ మల్మోత్రా, అక్షయ్ ఖన్నా, సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రధారులు. ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 3న ఈ చిత్రం విడుదలవుతోంది.

తెలుగులో కూడా?
ఇత్తెఫాఖ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హిందీలో ఈ చిత్రం హిట్టయితే తెలుగులో రీమేక్ విషయమై అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











