twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేవలం విజయ దేవరకొండతోనే.. ఆ హీరోతో వార్తలు నిజం కావు.. ఇజాబెల్లే

    |

    బ్రెజిల్ మోడల్ ఇజాబెల్లే టాలీవుడ్‌లో పాగేవేసేందుకు రెడీ అవుతున్నది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ప్రముఖ దర్శకుడు జయంత్ సీ పరాంజీ రూపొందించే నరేంద్ర చిత్రంలో నూతన హీరో నీలేష్ ఏటి‌ సరసన ఇజాబెల్లే హీరోయిన్‌గా నటిస్తున్నట్టు వార్తలు రావడంపై ఆమె స్పందించారు. వివరాల్లోకి వెళితే..

    బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌గా నరేంద్ర

    బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌గా నరేంద్ర

    బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌గా రూపొందుతున్న నరేంద్ర చిత్రంలో అంతర్జాతీయ బాక్సర్ ది గ్రేట్ ఖలీ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు వస్తున్నాడు. ఈ సినిమా గురించి తనపై వస్తున్న వార్తలపై ఇజాబెల్లే స్పందించారు. నరేంద్ర చిత్రంలో నటించడం లేదని చెప్పారు.

    మిస్టర్ మజ్నులో గెస్ట్‌గా ఇజా

    మిస్టర్ మజ్నులో గెస్ట్‌గా ఇజా

    మిస్టర్ మజ్ను సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన తర్వాత నేను తెలుగులో ఏ చిత్రంలో నటించలేదు. ఒకవేళ నేను ఏదైనా సినిమాను అంగీకరిస్తే నా ఫ్యాన్స్‌కు తెలియజేస్తాను. కొన్ని సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఏవీ ఫైనల్ కాలేదు అని ఇజాబెల్లే చెప్పారు.

    నన్ను ఎవరూ సంప్రదించలేదు

    నన్ను ఎవరూ సంప్రదించలేదు

    నరేంద్ర సినిమా గురించి ఓ విషయం చెప్పదలచుకొన్నాను. ఈ సినిమాలో నేను నటించడం లేదు. ఇప్పటి వరకు నన్ను ఎవరూ సంప్రదించలేదు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే. కొన్ని వార్తలు నా దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ వివరణ ఇస్తున్నాను అని సోషల్ మీడియాలో ఇజాబెల్లే తెలిపారు.

    విజయ్ దేవరకొండతో కలిసి

    విజయ్ దేవరకొండతో కలిసి

    మిస్టర్ మజ్నులో గెస్ట్ రోల్‌లో కనిపించిన ఇజాబెల్లే ప్రస్తుతం విజయ దేవరకొండ సరసన మరో చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది.

    English summary
    Actor Izabelle denies reports suggesting that she is a part of Jayanth C Paranji's forthcoming film Narendra. I have not been contacted for the movie yet. She is been seen opposite Vijay Deverkonda in Kranthi Madhav movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X