Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కేవలం విజయ దేవరకొండతోనే.. ఆ హీరోతో వార్తలు నిజం కావు.. ఇజాబెల్లే
బ్రెజిల్ మోడల్ ఇజాబెల్లే టాలీవుడ్లో పాగేవేసేందుకు రెడీ అవుతున్నది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ప్రముఖ దర్శకుడు జయంత్ సీ పరాంజీ రూపొందించే నరేంద్ర చిత్రంలో నూతన హీరో నీలేష్ ఏటి సరసన ఇజాబెల్లే హీరోయిన్గా నటిస్తున్నట్టు వార్తలు రావడంపై ఆమె స్పందించారు. వివరాల్లోకి వెళితే..
బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌గా నరేంద్ర
బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌గా రూపొందుతున్న నరేంద్ర చిత్రంలో అంతర్జాతీయ బాక్సర్ ది గ్రేట్ ఖలీ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు వస్తున్నాడు. ఈ సినిమా గురించి తనపై వస్తున్న వార్తలపై ఇజాబెల్లే స్పందించారు. నరేంద్ర చిత్రంలో నటించడం లేదని చెప్పారు.
మిస్టర్ మజ్నులో గెస్ట్‌గా ఇజా
మిస్టర్ మజ్ను సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన తర్వాత నేను తెలుగులో ఏ చిత్రంలో నటించలేదు. ఒకవేళ నేను ఏదైనా సినిమాను అంగీకరిస్తే నా ఫ్యాన్స్‌కు తెలియజేస్తాను. కొన్ని సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఏవీ ఫైనల్ కాలేదు అని ఇజాబెల్లే చెప్పారు.
నన్ను ఎవరూ సంప్రదించలేదు
నరేంద్ర సినిమా గురించి ఓ విషయం చెప్పదలచుకొన్నాను. ఈ సినిమాలో నేను నటించడం లేదు. ఇప్పటి వరకు నన్ను ఎవరూ సంప్రదించలేదు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే. కొన్ని వార్తలు నా దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ వివరణ ఇస్తున్నాను అని సోషల్ మీడియాలో ఇజాబెల్లే తెలిపారు.
విజయ్ దేవరకొండతో కలిసి
మిస్టర్ మజ్నులో గెస్ట్ రోల్లో కనిపించిన ఇజాబెల్లే ప్రస్తుతం విజయ దేవరకొండ సరసన మరో చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది.