twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ చేతిలో టీడీపీ పగ్గాలు.. సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి సంచలనం

    |

    Recommended Video

    TDP Future In Jr NTR’s Hand? JC. Diwakar Reddy Interesting Comments || Filmibeat Telugu

    2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలు కావడంతో ఒక్కసారిగా టీడీపీ రాజకీయ భవిష్యత్తుపై పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో టీపీడీ పార్టీ నడవడం సాధ్యపడని విషయమని, ప్రస్తుతం టీడీపీని నడిపే సత్తా ఉన్న పోలిషిషన్ ఆ పార్టీ ఒక్కరు కూడా లేరని విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరి చూపు జూనియర్ ఎన్టీఆర్ పైనే పడింది. టీడీపీ పార్టీకి పూర్వ వైభవం తేవాలంటే.. అది ఒక్క జూనియర్ ఎన్టీఆర్ తప్పితే మరెవ్వరి వల్ల కాలేని పని అని జనాల్లో చర్చలు ముదిరాయి. దీంతో తాజాగా ఈ అంశంపై రాజకీయ సంచలనం జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి పోతే..

    సోషల్ మీడియాలో డిమాండ్స్.. రాజకీయ వర్గాల్లో చర్చలు

    సోషల్ మీడియాలో డిమాండ్స్.. రాజకీయ వర్గాల్లో చర్చలు

    ఎన్నికల ఫలితాల్లో వైసీపీ భారీ విజయాన్ని చూసిన టీడీపీ వర్గాలు ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. ఓటమి గురించి ఆరాదీసే సమయం కూడా ఇవ్వకుండానే ఎన్టీఆర్ పేరు తెరపైకి తెచ్చేశారు జనం. వెంటనే టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ చేతిలో పెట్టేసి పార్టీని కాపాడుకోవాలని, లేదంటే పార్టీ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని సోషల్ మీడియాలో డిమాండ్స్ పెరిగాయి. మరోవైపు ఇదే అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

    టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి

    టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి

    ప్రస్తుతం హాట్ హాట్ చర్చలకు దరి తీస్తున్న ఈ ఇష్యుపై తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి స్పందించారు. ఎన్టీఆర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి ఏదైనా చేస్తే.. రాబోయే రోజుల్లో ప్రజా నాయకుడిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. తారక రామారావుని పోలి ఉన్న ఆయన ఆకారం, లక్షణాలు రాజకీయాల్లో ప్లస్ అవుతాయని జేసీ అన్నారు.

    పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావిస్తూ సెటైర్స్

    పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావిస్తూ సెటైర్స్

    కాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేరును కూడా తన ప్రస్తావనలో తీసుకొచ్చిన జేసీ.. పవన్‌ని సున్నితంగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి రాగానే వేలాది మంది విజిల్స్ వేసుకుంటూ వస్తున్నారంటే, అదంతా సిల్వర్ స్క్రీన్ ప్రభావమే తప్ప.. ఆయనేదో రాజకీయాల్లో సమూలమైన మార్పులు తీసుకొస్తారని కాదు. అది సినిమా వాళ్ళ పట్ల జనాల్లో ఉన్న ఆసక్తి మాత్రమే అని జేసీ అన్నారు.

    పవన్ కళ్యాణ్ నా దగ్గరకు ఓ దూతను పంపాడు

    పవన్ కళ్యాణ్ నా దగ్గరకు ఓ దూతను పంపాడు

    పవన్.. సొంత పార్టీ పెట్టే సమయంలో తన దగ్గరికి ఓ దూతను పంపారని జేసీ చెప్పారు. అయితే అప్పుడే.. ''పవన్‌ను చూడటానికి ప్రజలు వస్తారు తప్ప.. ఆయన మాటలు నమ్మి ఎవరూ రారు'' అని ఆ దూతకు వివరించానని జేసీ చెప్పుకొచ్చారు. రాజకీయాలు చాలా ఖర్చుతో కూడుకున్నవని, ఏదో అలా నాలుగు మాటలు చెప్పి అధికారం సంపాదించడం అంత ఈజీ కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ.

    కొనమెరుపుగా చంద్రబాబు గురించి..

    కొనమెరుపుగా చంద్రబాబు గురించి..

    ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం, టీడీపీ పగ్గాల విషయంలో పాజిటివ్ గా స్పందించిన జేసీ.. కొసమెరుపుగా చంద్రబాబును కూడా పైకెత్తేశారు. టీడీపీకి చంద్రబాబే దిక్కు. మనిషి మనస్తత్వాన్ని బట్టి, ఫిజిక్‌ను బట్టి ఆయనకు మరో పదేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేదనేది తన అభిప్రాయమని పేర్కొంటూ ఆసక్తికరంగా మాట్లాడారు జేసీ.

    English summary
    In 2019 Ap Elections Telugu Desham Party loosed their ruling. Ysr cp got prestigious win. On this issue senior polition J. C. Diwakar Reddy commented on TDP future. He says one of powerfull person to lead TDP is Ntr Jr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X