అమ్మ నా కొడుకు ఇరుగదీశాడే.. నా కొడుకుల్లారా హీరో ప్రిపేరై వస్తున్నాడు.. కార్తికేయపై జేడీ కామెంట్స్

Recommended Video

JD Chakravarthy Speech At Hippi Movie Press Meet || Filmibeat Telugu

ఆర్ఎక్స్ 100 చిత్రంతో యువ హీరో కార్తికేయకు మంచి గుర్తింపు లభించింది. ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయ బోల్డ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టేశాడు. ప్రస్తుతం కార్తికేయకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం హిప్పీ. ఇది కూడా ఘాటైన రొమాన్స్ తో కూడుకున్న చిత్రమే. టీఎన్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. సీనియర్ నటుడు జెడి చక్రవర్తి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. గురువారం రోజు హిప్పీ చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. జెడి చక్రవర్తి ప్రసంగిస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

కుడిచేయి పనికిరాదు అన్నారు

కుడిచేయి పనికిరాదు అన్నారు

జెడి చక్రవర్తి మాట్లాడుతూ హిప్పీ నిర్మాత ఎస్ థానుపై ప్రశంసలు కురిపించారు. సౌత్ లో ఎప్పుడూ బిజీగా ఉండే నిర్మాతల్లో అయన ఒకరు అని జెడి చక్రవర్తి అన్నారు. తను నిర్మాణంలో నేను అరిమానంబి అనే తమిళ చిత్రం చేశా. ఆ సమయంలో నా చేతికి గాయం అయింది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే కుడిచేయి పనికిరాదని అన్నారు. ఈ విషయం థానుకి తెలిసింది. ఆయనే స్వయంగా తనకు తెలిసిన డాక్టర్ వద్దకు తీసుకునివెళ్ళి వైద్యం చేయించారు. ఆపరేషన్ అవసరం లేకుండానే ట్రీట్మెంట్ చేశారు. ఆ రోజు నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. కానీ నాకు దగ్గరుండి చికిత్స చేయించారని జెడి చక్రవర్తి ప్రశంసించారు.

బుర్ర ఉండే హీరోయిన్

బుర్ర ఉండే హీరోయిన్

సాధారణంగా చాలా మంది అమ్మాయిలు అందంగా ఉంటారు. అందరికి బుర్ర ఉండదు. హిప్పీ చిత్రంలో దిగాంగన సూర్యవంశి హీరోయిన్ గా నటిస్తోంది. దిగాంగన ఎంత అందమైన అమ్మాయో అంతే తెలివైన అమ్మాయి అని జెడి చక్రవర్తి అన్నారు. ఆమె డైలాగులని సెట్స్ లో అవసరమైన మేరకు మాత్రమే చెప్పే వాళ్ళం. నాకు పూర్తి సన్నివేశం అర్థం చెప్పండి నేను నేర్చుకోవాలి అని పట్టుబట్టి తెలుసుకుంది అని జేడీ చక్రవర్తి అన్నారు.

మిగిలిన హీరోల ప్లేట్లు

మిగిలిన హీరోల ప్లేట్లు

కార్తికేయని తొలిసారి ఫైట్ సీన్ చేస్తుంటే చూశానని జెడి చక్రవర్తి అన్నారు. చూడగానే చాలా బాగా చేస్తున్నాడు అని పైకి అనుకున్నా. అమ్మ నా కొడుకు ఇలా ఇరగదీస్తున్నాడు ఏంటి వీడు అని మనసులో అనుకున్నా. మిగిలిన హీరోల ప్లేట్లు కూడా లాగేసేలా ఉన్నాడు అని అనుకున్నట్లు జెడి చక్రవర్తి తెలిపాడు. కార్తికేయ నటనలో తనకంటూ ఓ ప్రత్యేకతని ప్రదర్శిస్తున్నాడు అని జెడి తెలిపాడు.

నా ఇగో హార్ట్ అయింది

నా ఇగో హార్ట్ అయింది

ఈ చిత్ర దర్శకుడు నన్ను కలసి కథ వివరించాడు. అంతా ఒకే అయింది. మళ్ళీ నాలుగురోజుల తర్వాత మిమ్మలి టెస్ట్ చేయాలి రమ్మని అడిగాడు. దీనితో నా ఇగో హర్ట్ అయిందని జెడి తెలిపాడు. అయినా కూడా వెళ్లి అతడిని కలిశా. ఆ రోజు ఏదైనా కారణం చెప్పి అతడిని కలవకుండా ఉండి ఉంటే నష్టపోయి ఉండేది నేనే అని జెడి చక్రవర్తి తెలిపాడు. టీఎన్ కృష్ణ ఈ చిత్రం పట్ల చాలా క్లారిటీతో ఉన్నాడని జెడి చక్రవర్తి వివరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X