twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జెనీలియా సినిమాకు అంత రేటా?

    By Staff
    |

    Jaane Tu
    బాలీవుడ్ లో కూడా శాటిలైట్ రేట్స్ బాగా పెరిగాయి. నాలుగు నెలల క్రిందట అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ ని పరిచయం చేస్తూ,జెనీలియా కాంబినేషన్ లో నువ్వే కావాలి కాన్సెప్ట్ తో జానేతూ అనే సినిమా వచ్చిది.ఆ సినిమా మంచి విజయం సాదించింది. దాంతో ఆ చిత్రానికి శాటిలైట్ రైట్స్ కి మంచి డిమాండ్ ఏర్పడింది.అయితే ఆ చిత్రాన్ని రిలీజ్ కి ముందే తారే జమీన్ పర్ చిత్రంతో కలపి ప్యాకేజీగా జీ టివి వారికి అమ్మేసారు. అప్పుడు మూడు కోట్లు పలికింది.

    ఇప్పుడు సీన్ మారింది.కలర్స్ ఛానెల్ వారు తమకి జానే తూ సినిమా కావాలని జీ వారిని అడిగారు. జీ వారు ఆలోచించుకుని టేబుల్ ప్రాపెట్ గా అక్షరాలా పదిహేడు కోట్ల పదకొండు లక్షలకు అమ్మేసారు. దాంతో తారా జమీన్ పర్ తొమ్మిది కోట్ల హైయిస్ట్ శాటిలైట్ రైట్ ని ఆ చిత్రం దాటిపోయింది. అలాగే జానేతూ బడ్జెట్ కి పదిహేడు కోట్లు అనేది మూడు రెట్లు మొత్తం. ఇక ఇంత రేటుకి కలర్స్ ఛానెల్ వారు తీసుకుంటే...వారు మొత్తం టీవీలో వేసుకుని యాడ్ రెవిన్యూ ఎంత ఆశిస్తున్నారో అని బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.

    అంటే భాక్సాఫీస్ వద్ద జానేతూ వసూలు చేసిన మొత్తం,దానిపై జీ వారు సంపాదించిన లాభం,రాబోయే రోజుల్లో ఛానెల్ వారు సంపాదించబోయే రెవిన్యూ,ఓవర్ సీస్ రైట్స్ అలా చాలా పెద్ద లో వసూలు చేస్తోంది...చెయ్యబోతోంది. ఓ చిన్న సినిమా పెద్ద విజయం అని నిరూపించిన ఇటువంటి చిత్రాలు తెలుగులో ఎప్పుడు వస్తాయో...మనకెప్పుడు అంత రేటు పలుకుతాయో.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X