twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జాను ఫస్ట్ టాక్.. ఆ ఎపిసోడ్స్ కీలకం.. త్రిష, సమంతలో ఎవరు బెస్ట్ అంటే?

    |

    Recommended Video

    Jaanu Movie Review | Sharwanand | Samantha | 96 Movie | Jaanu

    సమంత, శర్వానంద్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం జాను. తమిళ నాట సంచలనాలు సృష్టించిన 96 సినిమాకు రీమేక్‌గా జాను తెరకెక్కింది. విజయ్ సేతుపతి-త్రిష క్రియేట్ చేసిన మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు నేడు (ఫిబ్రవరి 7) ప్రేక్షకుల ముందుకు శర్వానంద్, సమంతలు వచ్చారు. మరి వీరి ప్రయత్నం నెరవేరిందా? లేదా? అన్నది ఓ సారి చూద్దాం.. జానుపై ట్విట్టర్‌లో ఎలాంటి చర్చ జరుగుతోందో పరిశీలిద్దాం.

    అలా మొదలు..

    అలా మొదలు..

    జాను చిత్రం లైఫ్ ఆఫ్ రామ్ పాటతో మొదలవుతుందని, అందులో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా శర్వానంద్ రా లుక్‌లో ఇరగదీశాడని టాక్. ఈ పాటలో ఆఫ్రికా అందాలను, నేచర్‌ను అందంగా చూపెట్టారని కామెంట్లు చేస్తున్నారు.

    మెల్లిగా ఫ్లాష్ బ్యాక్‌లోకి..

    మెల్లిగా ఫ్లాష్ బ్యాక్‌లోకి..

    ఆపై ఫోటోగ్రఫీకి సంబంధించిన పాఠాలు చెప్పడం, తన స్కూల్‌కు వెళ్లడం, చిన్నపటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం లాంటి సీన్లతో జాను ముందుకు సాగుతుంది. వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ ఎంట్రీతో నవ్వులు మొదలవుతాయని టాక్. ఆపై గెట్ టుగేదర్‌కు సంబంధించిన ఏర్పాట్లు జరగడం ఇలా చకచకా వెళ్తుందట.

    ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్..

    ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్..


    అలా మెల్లిగా ఫ్లాష్ బ్యాక్‌లోకి సినిమా వెళ్తుంది. జాను, రామ్‌ల మధ్య స్కూల్ ఎపిసోడ్ మాత్రం అదిరిపోయిందని తెలుస్తోంది. స్వచ్చమైన ప్రేమను తెలుసుకోవడానికి ఈ తరం యువత కచ్చితంగా చూడాల్సిన చిత్రమని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

    శర్వానంద్ సూపర్బ్..

    శర్వానంద్ సూపర్బ్..

    శర్వానంద్ జానులో అద్భుతంగా నటించాడని ప్రతీ సీన్‌లో ఎక్స్‌ప్రెషన్స్‌తోనే ఎమోషన్స్ పలికించేసేడని అంటున్నారు. అయితే విజయ్ సేతుపతితో పోలిక వద్దని, ఎవరి స్టైల్లో వారే నటనలో జీవించేశారని టాక్.

    మైమరింపించిన సమంత..

    మైమరింపించిన సమంత..

    జానకీ దేవీ, జానుగా సమంత జీవించేసిందని తెలుస్తోంది. ఈ సినిమాకు జాను పాత్రే కీలకం కావడం, ఆ క్యారెక్టర్‌ను సమంత పోషించడం కలిసి వచ్చిందని టాక్. ఈ సినిమాలో సమంత నిజంగానే అందర్నీ మైమరింపజేసిందట. త్రిషతో పోలిక వచ్చినప్పుడు కొన్ని చోట్ల తడబడినా.. జానుగా మాత్రం సమంత ఇరగదీసేసిందని టాక్.

    ప్రత్యేకంగా నిలిచిన సంగీతం..

    ప్రత్యేకంగా నిలిచిన సంగీతం..

    గోవింద్ వసంత్ అందించిన సంగీతం జానుకు ప్రధాన బలంగా మారినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సమంత, శర్వా సీన్స్‌కు గోవింద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయినట్టు తెలుస్తోంది. స్కూల్ ఎపిసోడ్స్ నేపథ్య సంగీతం అయితే మరో లెవెల్‌లో ఉందని టాక్. పాటలు విజువల్ ట్రీట్‌గా ఉన్నాయని అంటున్నారు.

    English summary
    Jaanu Movie Twitter Review. Samantha And Sharwanand Stars Jaanu Is Going To Be Release On 7th February.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X