twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జాను మూవీ ట్విట్టర్ రివ్యూ.. సమంత, శర్వానంద్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే

    |

    Recommended Video

    Jaanu Movie Review | Sharwanand | Samantha | 96 Movie | Jaanu

    విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, అందాల తార త్రిష జంటగా నటించిన 96 చిత్రం తమిళంలో అద్భుతమైన విజయాన్ని అందుకొన్నది. సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ విమర్శకులను మెప్పించిన ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై యువ హీరో శర్వానంద్, క్రేజీ స్టార్ సమంత అక్కినేని జంటగా జానుగా తెరకెక్కించారు. టీజర్లు, ట్రైలర్లు యూత్‌ను విశేషంగా ఆకట్టుకొన్నాయి. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఈ సినిమాపై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ ఏమిటంటే..

    స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏమిటో..

    జాను బెస్ట్ మూవీ. సమంత, శర్వానంద్ ఎక్సలెంట్. జాను, రామును ఇప్పుడే చూశాను. వారిద్దరి పెర్ఫార్మెన్స్‌ను మాటల్లో చెప్పలేను. సీన్లు విజువల్‌గా మైండ్ బ్లాక్. నిజమైన, స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏమిటో నేటి యువత ఈ సినిమాను చూసి నేర్చుకోవాలి అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

    మై ఏంజెల్ సమంతకు..

    మై ఏంజెల్ సమంత, యంగ్ టాలెంటెడ్ శర్వానంద్ ఓ క్లాసిక్ లవ్ స్టోరీలో జంటగా నటించడం ఆనందంగా ఉంది. కొత్త సంవత్సరంలో జాను చిత్రం సమంతకు తొలి బ్లాక్ బస్టర్ కావాలని కోరుకొంటున్నాను అని అభిమాని ట్వీట్ చేశారు.

    ఎస్ థమన్ ట్వీట్

    నా ప్రియమైన వారికి నా బెస్ట్ విషెస్ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ ట్వీట్ చేశారు.

    2020లో కూడా అదరగొట్టాలి

    డియర్ సమంత.. 2019 సంవత్సరం మీకు అద్భుతమైన విజయాలను అందించింది. వరుస హిట్లతో ప్రేక్షకులను మెప్పించావు. గత సంవత్సరం మాదిరిగానే 2020 కూడా మీకు మంచి సక్సెస్‌ను అందించాలి అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశారు.

    సూపర్ సామ్.. ఆల్ ది బెస్ట్

    సూపర్ సామ్.. ఆల్ ది బెస్ట్ మీకు.. మీ చిత్ర యూనిట్‌కు అంటూ హీరో సుశాంత్ ట్వీట్ చేశారు.

    English summary
    Jaanu movie twitter review: Jaanu Telugu romantic drama film directed by C Prem Kumar based on his Tamil classic hit '96. This movie is bankrolled by Dil Raju on his Sri Venkateswara Creations. Sharwanand and Samantha Akkineni plays lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X