జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ మళ్లీ అదే రూట్లో.. ఇక స్టార్ హీరోతో..
నేటితరం దర్శకులు సక్సెస్ అందుకోవడానికి సరికొత్త ఫార్ములాలను క్రియేట్ చేసుకుంటున్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో వెళ్లకుండా వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకునేలా బాక్సాఫీస్ హిట్స్ కొట్టేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో అనుదీప్ పేరు హాట్ టాపిక్ గా మారింది. జాతిరత్నాలు సినిమాతో మంచి టాక్ సొంతం చేసుకున్న అనుదీప్ సెకండ్ సినిమాపై కూడా క్లారిటీ వచ్చేసింది.

ఉయ్యాల జంపాల సినిమాకు..
తెలంగాణలోని సంగారెడ్డి ప్రాంతానికి చెందిన KV అనుదీప్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పదేళ్ల క్రితమే తన కెరీర్ ను స్టార్ట్ చేశాడు. అనుదీప్ కు జాతిరత్నాలు మొదటి సినిమా కాదు. ఇదివరకే అతను ఒక సినిమా చేశాడు. అంతకుముందు ఉయ్యాల జంపాల సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి ఇండస్ట్రీలో అవకాశాల కోసం బాగానే తిరిగాడు.

మొదటి సినిమా జాతిరత్నాలు కాదు
అనుదీప్ మొదట పిట్టగొడ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. అందులో స్టార్ క్యాస్ట్ ఏమి లేదు. సురేష్ బాబు ప్రొడక్షన్ లోనే సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో నాని వాయిస్ ఓవర్ తో ట్రైలర్ పై బాగానే హైప్ క్రియేట్ చేశారు. కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

షార్ట్ ఫిలిమ్స్ చూసి..
ఇక దర్శకుడు నాగ్ అశ్విన్ అతని షార్ట్ ఫిలిమ్స్ ను ముందు నుంచే ఫాలో అవుతూ వస్తున్నాడట. ఎలాగైనా అతనితో ఒక సినిమాను నిర్మించాలని గతంలోనే అనుకున్నట్లు ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక జాతిరత్నాలు కథ చెప్పిన అనంతరం అతని కామెడీ టైమింగ్ ను ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా నాగ్ అశ్విన్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశాడట.

మార్షల్ ఆర్ట్ బ్యాక్ డ్రాప్ లో
ఇక నెక్స్ట్ సినిమా కూడా అనుదీప్ మళ్ళీ వైజయంతి నిర్మాతలతోనే చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ సినిమాపై క్లారిటి ఇచ్చాడు. ముడు కథలైతే రెడీగా ఉన్నాయని అంటూ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ యాంగిల్ లో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నట్లు వివరణ ఇచ్చాడు. ఇక ఆ సినిమా స్టార్ హీరోతోనే ఉంటుందని రూమర్స్ వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











