సినిమాలో హారర్...ఇందులో మాత్రం శృంగారం (ఫోటోలు)
హైదరాబాద్: జె.ఆర్.ఇ గ్రూప్ పతాకంపై హేమరాజ్ దర్శకత్వంలో టి.జయచంద్ర రూపొందించిన చిత్రం'జాబాలి'. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అరుణ్, షర్మిష్ఠ, అనన్యా త్యాగి ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
ఈ చిత్రం గూర్చి దర్శకుడు మాట్లాడుతూ- షూటింగ్ పూర్తయిందని, హైదరాబాద్, తలకోనలో చిత్రీకరించిన సన్నివేశాలు హైలెట్‌గా ఉంటాయని, 80 నిమిషాల గ్రాఫిక్స్ హార్రర్ అందరికీ నచ్చుతుందని తెలిపారు. ఇప్పుడు వస్తున్న హారర్ చిత్రాలకు భిన్నంగా రూపొందించామని అన్నారు.
హారర్ సినిమా అని చెబుతున్నప్పటికీ...తాజాగా విడుదలైన ఈ చిత్రం ప్రమోషన్ ఫోటోలు చేస్తే మాత్రం శృంగార చిత్రాన్ని తలపిస్తోంది. ఇలాంటి హాట్ ఫోటోలు విడుదల చేయడం ద్వారా తమ సినిమాపై అందరి దృష్టి పడేలా చేయడమే దర్శక నిర్మాత లక్ష్యంగా కనిపిస్తోంది.

స్టోరీ ఏంటి?
ఓ ఆయుర్వేద కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థినీ విద్యార్థులు ఓ మందును కనిపెట్టడానికి కీకారణ్యంలోకి వెళతారని, అక్కడ వారికి ఎదురైన అనేక సంఘటనల సమాహారంగా ఈ చిత్రం ఉంటుందట.

ఆత్మ
మందు మొక్కలకోసం వెతుకుతుంటే, తాళపత్ర గ్రంథాలు దొరికిన విద్యార్థులు మూత తీయగా అందులోనుంచి ఓ ఆత్మ బయటికివచ్చి వారితో ఎలా ఆడుకుంది అనే ఆసక్తికరమైన సన్నివేశాలతో చిత్రం ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిందని నిర్మాత జయచంద్ర తెలిపారు.

నటీనటులు
భాను, రాధిక, వినోద్, రాజు, వసంత్, సంతోష్, టెర్రర్ వెంకట్, ఆకెళ్ల గోపాలకృష్ణ తదితరులు నటిస్తున్నారు.

టెక్నీషియన్స్
ఈ చిత్రానికి కథ:రామ్ జై, సంగీతం:జై సుధాకర్, కెమెరా:గుణశేఖరన్, నిర్మాత:టి.జయచంద్ర, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:హేమరాజ్.

హారర్ మూవీ
జె.ఆర్.ఇ గ్రూప్ పతాకంపై హేమరాజ్ దర్శకత్వంలో టి.జయచంద్ర రూపొందించిన ‘జాబాలి' చిత్రం హారర్ నేపథ్యంలో సాగుతోంది.

పోస్టర్లు హాట్‌గా
హారర్ సినిమా అని చెబుతున్నప్పటికీ...తాజాగా విడుదలైన ఈ చిత్రం ప్రమోషన్ ఫోటోలు చేస్తే మాత్రం శృంగార చిత్రాన్ని తలపిస్తోంది. ఇలాంటి హాట్ ఫోటోలు విడుదల చేయడం ద్వారా తమ సినిమాపై అందరి దృష్టి పడేలా చేయడమే దర్శక నిర్మాత లక్ష్యంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications