చేయని నేరానికి శిక్ష వేయొద్దు.. మంచి పనిని ప్రమోట్ చేయండి.. జబర్దస్త్ అభి ఝలక్
కారు యాక్సిండెట్ కారణమంటూ మీడియాలో వస్తున్న వార్తలపై జబర్దస్త్ ఫేం అభి అలియాస్ అభినయ్ కృష్ణ స్పందించారు. కారు ప్రమాదం విషయం మీడియాలో రావడంతో నా ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులు, స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. ఆ వార్త తెలియగానే నేను కూడా డిస్ట్రబ్ అయ్యానను అంటూ అభి తాజాగా వీడియోను రిలీజ్ చేశారు. చేయని నేరానికి శిక్ష వేయొద్దు.. మంచి పనిని ప్రమోట్ చేయండి అనే విధంగా వీడియోలో పేర్కొన్నారు. తనకు, కారు ప్రమాదానికి సంబంధం లేదంటూ వివరణ ఇస్తూ..

కారు ప్రమాదం వార్త విని షాక్ గురయ్యాను
అదిరే అభి అలియాస్ అభినయ్ కృష్ట కారుతో బీభత్సం సృష్టించారు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అనే వార్త చూసి చాలా షాక్ గురయ్యాను. అంతకుముందే కొందరు జర్నలిస్టు మిత్రులు, సోదరులు కొంత మంది ఫోన్ చేసి క్లారిటీ తీసుకొన్నారు. వాస్తవానికి నేను బుధవారం ఇంటి నుంచి బయటకు రాలేదు. ఆ కారు నాది కాదు అని జబర్దస్త్ అభి తెలిపారు.

అత్యుత్సాహంతో బ్రేకింగులు..
టెలివిజన్ ఛానెల్స్‌లో కొంత మంది అత్యుత్సాహంతో అభి కారు బీభత్సం అంటూ స్క్రోలింగ్‌లు వేశారు. దాంతో అర్ధరాత్రి నాకు చాలా మంది ఫోన్ చేసి నా యోగక్షేమాలు తెలుసుకొన్నారు. అయితే వాస్తవాలు తెలుసుకోకుండా టెలివిజన్‌లో బ్రేకింగులు వేసి, స్కోలింగ్ వేయడంతో మనసు కలిచివేయడంతోపాటు బాధ కూడా పడ్డాను అని జబర్దస్త్ అభి ఆవేదన వ్యక్తం చేశారు.

మంచి పని చేస్తే రాయరు.. కానీ
అయితే ఎవరైనా మంచి పనులు చేస్తే న్యూస్ రాసినా.. టీవీలో ప్రసారం చేస్తే హ్యాపీగా ఉంటుంది. గతవారం నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాను. అలాంటి విషయాలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అలాంటి మంచి పనులు చేస్తే ప్రమోట్ చేయరు. కానీ నాకు సంబంధం లేని ఓ ప్రమాదాన్ని అంటగట్టి ప్రసారం చేస్తే బాధ కలిగింది అని అభి అన్నారు.

ఏదైనా విషయం తెలిస్తే క్లారిటీ తీసుకోండి..
నా గురించి ఎలాంటి వార్త మీకు తెలిసినా.. మీ వద్దకు వచ్చినా నాకు కాల్ చేసి క్లారిటీ తీసుకోండి. క్లారిటీ ఇవ్వడానికి ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. అంతేగాని తప్పుడు సమాచారంతో వార్తలు ప్రచురించవద్దు. ఇలాంటి వార్త మళ్లీ మీ వద్దకు వస్తే దానిని పట్టించుకోవద్దు. ఆ యాక్సిడెంట్ నేను చేసింది కాదు. ఆ కారు నాది కూడా కాదు. నేను బాగానే ఉన్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అని అదిరే అభి తన వీడియోలో పేర్కొన్నారు.
గందరగోళం సృష్టించిన కారు ప్రమాదం
బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని మణికొండలో ఓ కారు యాక్సిండెట్ జరిగింది. ఆ ప్రమాదం ఇద్దరు సెలబ్రిటీలను గందరగోళంలోకి నెట్టింది. కారు ప్రమాదానికి దగ్గుబాటి అభిరాం, జబర్దస్త్ అభి కారణమంటూ రెండు వేర్వేరు వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో జబర్దస్త్ అభి, దగ్గుబాటి అభిరామ్ ఫ్యామిలీ సభ్యులు వేర్వేరు ప్రకటనల్లో క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











