»   » జబర్దస్త్: యాంకర్ అనసూయ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

జబర్దస్త్: యాంకర్ అనసూయ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జబర్దస్త్ షో అంటే యాంకర్ అనసూయ అనేంతలా పాపుల్ అయింది ఈ బ్యూటీ. పలు కారణాలతో ఆమె ఈ షో నుండి బయటకు వెళ్లింది. ఆమె స్థానంలో రష్మి వచ్చింది. రష్మి వచ్చి చాలా కాలం అయినా కొందరు అనసూయను మరిచిపోలేక పోతున్నారు. జబర్దస్త్ లో అనసూయను మిస్ అవుతున్నామనుకునే వారికి గుడ్ న్యూస్. బుల్లితెరపై అనసూయను మళ్లీ చూడొచ్చు.

అలా అని అనసూయ మళ్లీ జబర్దస్త్ లోకి వస్తుందని కాదు. అనసూయ చేసిన పాత జబర్దస్త్ ఎపిసోట్లను కొత్తగా లాంచ్ అయిన ఈటీవీ ప్లస్ లో రీ టెలికాస్ట్ చేస్తున్నారు. అనసూయ సోయగాలు, గడసరి మాటలు చూడాలనుకునే వారికి ఇది గుడ్ న్యూసే మరి.

యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో ఒక్కొక్కమెట్టు ఎక్కుతూ వస్తోంది అనసూయ. ఆకట్టుకునే అందం, చలకీతనం, మాటల్లో గడుసుతనంతో ఆమె యాంకరింగ్ రంగంలో దూసుకెళ్లడంతో పాటు సినిమాలు అవకాశాలు కూడా దక్కించుకుంటోంది.

Jabardast old Episodes in ETV Plus

ప్రస్తుతం నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ‘సోగ్గేడే చిన్ని నాయనా' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు గాను అమ్మడు రోజుల లెక్కన రెమ్యూనరేషన్ తీసుకుందట. రోజుకు 4 లక్షల చొప్పున 10 రోజులు షూటింగులో పాల్గొన్నందుకు రూ. 40 లక్షలు చార్జ్ చేసినట్లు సమాచారం.

తెలుగులో అదా శర్మ, రెజీనా లాంటి హీరోయిన్లకు కూడా రోజు 4 లక్షల రేంజిలో రెమ్యూనరేషన్ లేదు. వారు నెలల తరబడి షూటింగుల్లో కష్టపడతారు. పైగా డాన్సులు, హాట్ రొమాంటిక్ సీన్లు, ముద్దు సీన్లు ఇలా చాలా చేయాలి. కానీ అవేమీ లేకుండానే అనసూయ ఈ రేంజిలో రెమ్యూనరేషన్ అందుకోవడం హాట్ టాపిక్ అయింది.

English summary
Jabardast old Episodes Re telecast in ETV Plus.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu