Rashmi Gautam: బాయ్ ఫ్రెండ్స్ గురించి రష్మి షాకింగ్ కామెంట్స్... ఆయన సినిమా అయితే స్టోరీ కూడా అడగదట!
యాంకర్ రష్మి... తన చలాకీ మాటలతో, అందంతో ఇట్టే కట్టేపడేస్తుంది. అయితే ఈ భామ.. ఓ కన్నడ డబ్బింగ్ మూవీలో స్పెషల్ అట్రాక్షన్ గా ఓ రోల్ చేసింది. ఇక ఆ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న రష్మి.. విలేఖరులు అడిగే ప్రశ్నలకు ఘాటైనా సమాధానాలు ఇచ్చింది. బాయ్ ఫ్రెండ్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతే కాదు.. ఆయన కథ అయితే వినకుండానే చేస్తుందట. ఆ విశేషాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కేజీఎఫ్ సీరిస్ సినిమాలతో కన్నడ పరిశ్రమకు మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఇక ఆ పరిశ్రమ నుంచి వరుసగా మంచి సినిమాలు వస్తున్నాయి. కాంతార, చార్లీ 777, విక్రాంత్ రొనా.. ఇలా కొన్ని మంచి సినిమాలు డబ్ చేసి.. తెలుగులో కూడా వదులుతున్నారు. అయితే ఇప్పుడు మరో సినిమాను తెలుగులో రిలీజ్ చేయనున్నారు. కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన హాస్టల్ హుడుగరు బేకాగిద్దరే సినిమా ఇప్పుడు తెలుగులో రానుంది.

బాయ్స్ హాస్టల్ పేరుతో హాస్టల్ హుడుగరు బేకాగిద్దరే సినిమాను తెలుగులో డబ్ చేశారు. కన్నడలో తెరకెక్కించినప్పుడు అక్కడ రక్షిత్ శెట్టి, దివ్య స్పందన వంటి వాళ్లు అతిథి పాత్రలలో నటించారు. ఇక ఇప్పుడు తెలుగులో కూడా మరింత ఆసక్తి పెంచేందుకు దర్శకుడు తరుణ్ భాస్కర్ ను, యాంకర్, నటి రష్మి గౌతమ్ ని కూడా తెలుగు వెర్షన్ లో అతిథి పాత్రల్లో నటింపచేశారు.

ఇక బాయ్స్ హాస్టల్ చిత్రాన్ని చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి తెలుగులో రిలీజ్ చేస్తున్నాయి. చార్లీ ఫేమ్ రక్షిత్ శెట్టి సమర్పించిన ఈ సినిమాకు నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ శనివారం ఘనంగా జరిగింది. ఇందులో బేబీ టీంతో పాటు... రష్మి గౌతమ్ కూడా పాల్గొంది.

బాయ్స్ హాస్టల్ ట్రైలర్ లాంఛ్ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు రష్మి తనదైన శైలిలో సమాధాన ఇచ్చింది. ఈ క్రమంలోనే ప్రముఖ జర్నలిస్టు సురేష్ కొండేటి రష్మిని పలు ప్రశ్నలు అడిగారు. మీ లైఫ్ లో ఎవరైనా బాయ్స్ హాస్టల్ లో ఉండే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? అని ప్రశ్నించగా.. రష్మి తనదైన స్టైల్ షాకింగ్ కామెంట్స్ చేసింది.
రష్మి తాను మాట్లాడుతూ... ఎప్పుడూ హాస్టల్లో ఉండలేదని చెప్పుకొచ్చింది. అలా కాదు మీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడైనా బాయ్స్ హాస్టల్ లో ఉన్నారా? అని అడిగితే ఆమె కాసేపు ఆలోచించి ఇప్పుడు బాయ్స్ హాస్టల్ లో ఉన్న బాయ్ ఫ్రెండ్ లతో రిలేషన్ లో ఉన్నానంటే చాలా గ్యాప్ వచ్చేసినట్టు భావించాలి. నాకు అలాంటి బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఇక చిరంజీవి సినిమా అయితే స్టోరీ కూడా వినకుండా చేస్తానంటూ చెప్పుకొచ్చింది. ఆయన పక్కన నటించడమే అదృష్టమని వెల్లడించింది. అలాగే అతిథి పాత్రలలో తాను నటించడం గురించి ఆమె ప్రస్తావిస్తూ సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు ఎలాంటి పాత్రలో వచ్చినా చేసుకుంటూ వెళుతూ ఉండాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


Click it and Unblock the Notifications











