Bhola Shankar మేనియాలో జబర్దస్త్ యాంకర్... చిరుతో కలిసి స్టేప్పులు ఇరగదీసిందిగా?

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం భోళా శంకర్. ఈ సినిమా రిలీజ్ అయి... ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ప్రిమియర్ షో పాటు.. ఫస్ట్ షో పడటంతో రివ్యూస్ బయటకు వస్తున్నాయి. ఇక మెగాస్టార్ సినిమా కావడంతో థియేటర్లకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక ఈ చిత్రంలో జబర్దస్త్ బ్యూటీ యాంకర్ రష్మిక కూడా ఉంది. అంతే కాదు భోళా మేనియా సాంగ్ లో రష్మి మెరిసింది. చిరుతో కలిసి స్టేప్పులు వేసింది. ఆ వివరాల్లోకి వెళితే...

సెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ మీద ఉన్నారు. చాలా వరకు రీమేక్ మూవీస్ తీస్తున్నప్పటికీ... తనదైన మార్క్, స్టైల్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో రావడం రావడంతోనే రీమేక్ మూవీతోనే అలరించారు. ఖైదీ నంబర్ 150 సినిమా తమిళంలో విజయ్ నటించిన కత్తి సినిమాకు రీమేక్. అయినప్పటికీ మూవీ తెలుగు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయింది. చిరంజీవి తనదైన స్టైల్ తో కొత్త మూవీ అన్న ఫీల్ కలిగించారు.

Jabardasth anchor Rashmi Gautam steps in Bhola Shankars Mania song with Chiranjeevi

ఇక ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమా పర్వాలేదనిపించినా... ఆచార్య మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. ఇక మళ్లీ రీమేక్ లనే నమ్ముకున్న చిరు.. మలయాళంలో సూపర్ హిట్టుగా నిలిచిన మోహన్ లాల్ సినిమా గాడ్ ఫాదర్ ను రీమేక్ చేశారు. ఇక తెలుగు నెటివిటీకి తగ్గట్లు రీమేక్ చేయడంతో అది సక్సెస్ అయింది. ఇక ఈ ఏడాది రవితేజతో కలిసి వాల్తేరు వీరయ్య సినిమాతో అలరించి.. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాడు. ఈ మూవీ సూపర్ హిట్టుగా నిలిచింది.

ఇప్పుడు మోహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేశాడు చిరు. ఇక ఈ మూవీ తమిళంలో హిట్టుగా నిలిచిన అజిత్ వేదాలం సినిమాకు రీమేక్. ఈ సినిమా వచ్చి 10 సంవత్సరాలు దాటింది. అయినా మళ్లీ చిరు.. ఈ సినిమాను రీమేక్ చేశాడు. తెలుగు నెటివిటికీ తగ్గట్లు మార్పులు, చేర్పులు చేసి ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ మూవీ ఆగస్టు 11న రిలీజ్ అయి ఆకట్టుకుంటోంది. అయితే మూవీలో చిరు సాంగ్ లో జబర్ధస్త్ యాంకర్ రష్మి మెరిసినట్లు తెలుస్తోంది.

Jabardasth anchor Rashmi Gautam steps in Bhola Shankars Mania song with Chiranjeevi

జబర్దస్త్ ప్రోగ్రాంతో బాగా పాపులర్ అయిన రష్మి.. ఈ మధ్య సినిమాల్లో కూడా కనిపిస్తుంది. అయితే ఆమెకు అంతగా మూవీస్ కలిసి రాలేదనే చెప్పాలి. ఎన్ని అందాలు ఆరబోసిన.. ఆమె సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక తాజాగా చిరంజీవి భోళా శంకర్ సినిమాలో ఓ పాటలో ఆమె కనిపించి.. స్టేప్పులు కూడా వేసింది. భోళా శంకర్ సినిమాలోని భోళా మేనియా సాంగ్ ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు.

Jabardasth anchor Rashmi Gautam steps in Bhola Shankars Mania song with Chiranjeevi

స్వరమహతి సాగర్ అందించిన మ్యూజిక్ పర్వాలేదనిపిస్తోంది. ఇక భోళా మేనియా సాంగ్ లో రష్మి తనదైన స్టైల్ లో చిరుతో కలిసి కాలు కదిపింది. చిరంజీవి సైతం... చి తన మార్క్ స్టెప్స్ తో అదరగొట్టారు. ఇక ఈ మూవీలో ఈ సాంగ్ ఆకట్టుకుంటుందని ప్రేక్షకులు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X