అమ్మాయిలను చూస్తే ఎగురేసుకుపోతాడు.. యువ హీరోపై జబర్దస్త్ అప్పారావు కామెంట్స్ వైరల్
ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్, పాపులర్ దర్శకుడు ఏఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా తిరగబడరా సామి. ఈ చిత్రంలో రాజ్ తరుణ్, మాళవిక మల్హోత్రా జంటగా నటిస్తున్నారు. జబర్దస్త్ అప్పారావు, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వివరాలను వెల్లడించేందుకు యూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా రాజా రవీంద్ర, జబర్దస్త్ అప్పారావు మాట్లాడుతూ..
తిరగబడరా సామి చిత్రంలో మటన్ మస్తాన్ అనే పాత్రలో నటిస్తున్నాను. ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాను. ఇంత వరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. డైరెక్టర్ చెప్పినట్టే ఈ రోల్ చేశాను. నేను చేసినా.. డైరెక్టర్ చేసినట్టే స్క్రీన్ మీద అనిపిస్తుంది. రాజ్ తరుణ్, మాళవిక మల్హోత్రా మధ్య కెమిస్ట్రీ బాగా ఉంటుంది. నిర్మాత మల్కాపురం శివకుమార్‌కు నిర్మాతకు ఉండే లక్షణాలు ఉన్నాయి. బోల్డెన్నీ సినిమాలు చేయాలి.. వీలైతే బోల్డు సినిమాకు కూడా చేయాలి. ఈ సినిమా నిర్మాతకు, అందరికీ మంచి సక్సెస్ ఇవ్వాలి అని కోరుకొంటున్నాను అని రాజా రవీంద్ర అన్నారు.
తిరగబడరా సామీ సినిమాలో రాజ్ తరుణ్, మాళవిక మల్హోత్రాతో కలిసి నటిస్తున్నాను. మాళవిక చాలా స్వీట్‌గా బబ్లీగా ఉంది. రాజ్ తరుణ్ అమ్మాయిలను చూస్తే ఎగురేసుకుపోతాడు. ఈ సినిమాలో మాళవిక, రాజ్ తరుణ్ మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. అలాగే నిర్మాత మల్కాపురం శివకుమార్ జహీరాబాద్ నుంచి మంచి బిర్యానీ పెట్టారు. అందుకు ధన్యవాదాలు అని జబర్దస్త్ అప్పారావు అన్నారు.

తిరగబడరా సామీ సినిమాకు ఏఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన హై వోల్టేజ్ ఎనర్జీతో సినిమాలు తీస్తారు. ఈ సినిమాకు తిరగబడరా సామీ అనే పవర్‌ఫుల్ టైటిల్ పెట్టారు. సామీ అని ప్రేమగా పిలుస్తారు. కానీ వైబ్రేషన్ ఇచ్చేలా తిరగబడరా సామీ అని అంటాం అని జబర్దస్త్ అప్పారావు తెలిపారు.
ఏఎస్ రవికుమార్, జవహర్ రెడ్డి మధ్య మంచి అవగాహన ఉంది. వారిద్దరు మంచి హిట్ కొట్టాలనే కసితో సినిమా చేస్తున్నారు. ఈ సందర్బంగా భార్యభర్తలుగా వర్క్ చేయలేదు. లవర్లుగా కలిసి పనిచేశారు. భార్యభర్తలుగా కలిసి పనిచేస్తే కోపతాపాలు ఉంటాయి. లవర్‌గా పనిచేస్తే ప్రేమను జుర్రుకోవడమే. వివరంగా, విపులంగా నిర్మాత సినిమా గురించి చెప్పారు. సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకొంటున్నాను అని జబర్దస్త్ అప్పారావు అన్నారు.

హీరోయిన్ మాళవిక మల్హోత్రా ముంబై నుంచి వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలింనగర్, మాదాపూర్‌లో మంచి విల్లా కొనుక్కొని ఇక్కడే స్థిరపడాలి. రాజ్ తరుణ్‌తో చాలా సినిమాలు చేయాలి. సినిమా యూనిట్ అందరికి మంచి జరుగాలని కోరుకొంటున్నాను అని జబర్దస్త్ అప్పారావు తెలిపారు.


Click it and Unblock the Notifications











