రోజుకు 15 లక్షలు తీసుకునే నేను రూ. 6 లక్షలకే చేశా: జబర్దస్త్ కమెడియన్
జంబలకిడి పంబ అనగానే ఈవివి సత్యనారాయణ తీసిన సూపర్ హిట్ కామెడీ చిత్రం గుర్తుకు వస్తుంది. ఇపుడు అదే పేరుతో తెలుగులో మరో సినిమా రాబోతోంది. కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రంలో సిద్ధి ఇద్నాని హీరోయిన్‌గా చేస్తోంది. పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్ కీలక పాత్రధారులు. జె.బి. మురళీకృష్ణ దర్శకత్వం వహించారు. రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రెమ్యూనరేషన్ వివరాలు వెల్లడించిన అప్పారావు
ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరుగింది. జబర్దస్థ్ షో కమెడియన్ అప్పారావు కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో అప్పారావు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా సినిమా పరిశ్రమకు చెందిన నటులు ఎవరూ తమ రెమ్యూనరేషన్ వివరాలను బహిరంగ వేదికల్లో బయట పెట్టరు. అయితే అప్పారావు తాను ఈ సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాల గురించి వెల్లడించి అందరినీ ఆశ్చర్య పరిచారు.

రోజుకు రూ. 15 లక్షల రెమ్యూనరేషన్
తనకు ఈ చిత్రంలో మంచి క్యారెక్ర్ ఇచ్చారని, ఇది కథలోనే ఉండే క్యారెక్టర్. ఇందులో వెన్నెల కిషోర్, సత్యం రాజేష్ కాంబినేషన్లో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో అవకాశం రావడమే ఎంతో గొప్పగా భావించాను. డబ్బుల గురించి ఆలోచించలేదు. రోజుకు రూ. 15 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకునే నేను... ఈ సినిమా కేవలం రూ. 6 లక్షలకే చేశాను. డబ్బులు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. సినిమా మాత్రం అలాగే ఉంండి పోతుంది అని అప్పారావు తెలిపారు.

ఈ మూవీలో చేయడ హ్యాపీ
అపుడు ‘జంబలకిడి పంబ' సినిమా చేశాను.... ఇపుడు ఈ ‘జంబలకిడి పంబ' సినిమాలో నటిస్తున్నాను. ‘గీతాంజలి`, `జయమ్ము నిశ్చయమ్మురా` తర్వాత శ్రీనివాసరెడ్డి చేస్తున్న మూడో సినిమా ఇది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

యాక్టర్స్, టెక్నీషియన్స్
సత్యం రాజేశ్, ధన్‌రాజ్, షకలక శంకర్, హరి తేజ, రాజ్యలక్ష్మి, హిమజ, కేదారి శంకర్, మధుమణి, మిర్చి కిరణ్, జబర్దస్త్ అప్పారావు, సన, సంతోష్, గుండు సుదర్శన్, జబర్దస్త్ ఫణి తదితరులు.
సంగీతం: గోపీసుందర్, కెమెరా: సతీశ్ ముత్యాల, ఆర్ట్: రాజీవ్ నాయర్, రచన, దర్శకత్వం: జె.బి.మురళీకృష్ణ (మను), నిర్మాతలు: రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్., సహ నిర్మాత: బి.సురేశ్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: సంతోష్.


Click it and Unblock the Notifications











