సిద్ధార్థ-సమంత ‘జబర్‌దస్త్’ ఆడియో వేడుక (ఫోటోలతో)

By Bojja Kumar

హైదరాబాద్: సిద్ధార్థ-సమంత జంటగా 'అలామొదలైంది' ఫేం నందినీ రెడ్డి దర్శకత్వంలో బెల్లకొండ సురేష్ నిర్మిస్తున్న 'జబర్‌దస్త్' మూవీ ఆడియో వేడుక అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ ఆడియో వేడుకకు దర్శకుడు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో ఆవిష్కరించారు. తొలి కాపీలను హీరో సునీల్, శ్రీహరి అందుకున్నారు.

ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ బెల్లంకొండ సురేష్ ఇటీవల నిర్మించిన బస్టాప్ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేసారు. దర్శకురాలు నందినీ రెడ్డి పై పూర్తి నమ్మకం ఉందని, ఆమె దర్శకత్వంలో వచ్చిన 'అలా మొదలైంది' చిత్రం తనకెంతో నచ్చిందని చెప్పుకొచ్చారు. గత చిత్రాలతో పోలిస్తే సిద్ధార్థ ఇందులో ఎంతో బాగా కనిపించనున్నారని, ఈ సినిమాలో అల్లా అల్లా సాంగ్ తనకెంతో నచ్చిందని, తమన్ మంచి సంగీతాన్ని అందించారని చెప్పుకొచ్చారు.

హీరో సిద్ధార్థ మాట్లాడుతూ.... 'హిట్ కొట్టిన తర్వాత నాతో సినిమా చేసిన దర్శకులు ఇప్పటి ఎవరూ లేరు. హిట్ కొట్టిన తర్వాత నాతో సినిమా తీసే దర్శకుల్లో నందినీరెడ్డి మొదటి వ్యక్తి. జబర్‌దస్త్ సినిమా మంచి మాస్ కామెడీ ఎంటర్ టైనర్. నా పాత్ర గోవిందగా, జిమ్ కారీగా కనిపిస్తుంది. నా సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వత సినిమా సూపర్ హిట్ అవుతుందనే కాన్ఫిడెంట్ వచ్చింది. 2013 సంవత్సరం నటుడిగా నాకు 10వ సంవత్సరం. ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు అయింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో నేను శ్రీహరితో కలిసి పని చేసాను. ఆ సినిమా పెద్ద హిట్టయింది. మా ఇద్దరి కాంబినేషన్లో మళ్లీ ఈ సినిమా అదే తరహా విజయం అందుకుంటుంది. తమన్ అందించిన సంగీతం ఎంతో బాగుంది' అని తెలిపారు. సమంత మాట్లాడుతూ సినిమాకు పని చేయడం హలిడే ట్రిప్ లా ఉందని, మేమంతా ఫ్యామిలీ మెంబర్స్ లా కలిసి పని చేసామని చెప్పుకొచ్చింది.

దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ.... 'తమన్ సినిమా కథకు తగిన విధంగా చాలా కష్ట పడి ఎన్నో ట్యూన్స్ వినిపించి మాకు నచ్చిన అద్భుతమైన ట్యూన్స్ చేసారు. తెలుగు సినిమా పరిశ్రమలోని బెస్ట్ ప్రొడ్యూసర్లలో బెల్లంకొండ సురేష్ ఒకరు. ఆయన మాకు ఎంతో సపోర్టివ్ గా ఉన్నారు. ఈ సినిమాలో సిద్ధార్థ కొత్త కోణంలో కనిపిస్తారు. ఆయన ఈ సినిమాలో చాలా కామెడీ పంచారు. ఈ సినిమా చూసిన తర్వాత సిద్ధార్థను అందరూ సిద్దార్థ కారీ అని పిలుస్తారు. సమంతను కూడా ఈచిత్రంలో కొత్త కోణం(రౌడీ రాణి)లో చూస్తారు. వెలిగొండ శ్రీనివాస్ మంచి డైలాగులు అందజేసారు. అదే విధంగా కోన వెంకట్ చాలా సపోర్ట్ ఇచ్చారు' అని వెల్లడించారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ... గతంలో సిద్ధార్థతో చేసిన లవ్ ఫెయిల్యూర్ క్లాస్ ఆల్బమ్. కానీ 'జబర్ దస్త్' మాస్ ఆల్బమ్. బెల్లకొండ సురేష్ తో నాకు ఇది నాలుగో చిత్రం. సినిమా పాటలు ప్రేక్షకులను అలరిస్తాయనే నమ్మకం ఉందన్నారు.

సిద్ధార్థ-సమంత ‘జబర్‌దస్త్’ ఆడియో వేడుక (ఫోటోలతో)

జబర్ దస్త్ ఆడియో వేడుకలో పాల్గొన్న సినీ ప్రముఖులు.

సిద్ధార్థ-సమంత ‘జబర్‌దస్త్’ ఆడియో వేడుక (ఫోటోలతో)

జబర్ దస్త్ ఆడియో సీడిని ఆవిష్కరించిన వివి వినయాక్.

సిద్ధార్థ-సమంత ‘జబర్‌దస్త్’ ఆడియో వేడుక (ఫోటోలతో)

శ్రీహరి, సునీల్, సిద్దార్థ, సమంత.

సిద్ధార్థ-సమంత ‘జబర్‌దస్త్’ ఆడియో వేడుక (ఫోటోలతో)

సునీల్, సిద్ధార్థ, సమంత.

సిద్ధార్థ-సమంత ‘జబర్‌దస్త్’ ఆడియో వేడుక (ఫోటోలతో)

సమంత ఆడియో వేడుకకు హాజరవుతున్న దృశ్యం.

సిద్ధార్థ-సమంత ‘జబర్‌దస్త్’ ఆడియో వేడుక (ఫోటోలతో)

ఆడియో వేడుకలో తాగుబోతు రమేష్ సందడి.

సిద్ధార్థ-సమంత ‘జబర్‌దస్త్’ ఆడియో వేడుక (ఫోటోలతో)

జబర్ దస్త్ పాటలకు డాన్సర్ల స్టెప్పులు.

సిద్ధార్థ-సమంత ‘జబర్‌దస్త్’ ఆడియో వేడుక (ఫోటోలతో)

సిద్ధార్థ, సమంత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X