యాంకర్ మంజూష పువ్వులాంటింది.. దూరంగా ఉండాలి.. ఆటో రాంప్రసాద్, జేడీ క్రేజీ కామెంట్స్

వీజే జయతి నటించి, నిర్మించిన నా ఫ్రెండ్‌దేమో పెళ్లి.. అనే మ్యూజిక్ ఆల్బమ్‌ను ఘనంగా రిలీజ్ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన నటుడు జేడీ చక్రవర్తి ఈ పాటను తన చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ పాటకు భీమ్స్ సంగీతం అందించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. ఈ మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ వేడుకలో ఆటో రాంప్రసాద్, జేడీ చక్రవర్తి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి, రాంప్రసాద్, యాంకర్ మంజూష మధ్య జరిగిన సంభాషణ వివరాల్లోకి వెళితే..

జేడీ చక్రవర్తితో నా పరిచయం: రాం ప్రసాద్ మాట్లాడుతూ.. 'నివృతి వైబ్స్‌కు థాంక్స్ చెప్పుకోవాల్సిందే. సినిమా పాటలకు ధీటుగా తీస్తున్నారు. జయతి గారు వెన్నెల ప్రోగ్రాంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఈ పాట నాకు చాలా నచ్చింది. టీవీలో ఆమెను చూసి ఫ్యాన్ అయ్యాను. అప్పటి నుంచి ఆమెను ఫాలో అవుతున్నాను. జయతి గారికి ఈ పాట రీ లాంచ్‌లా ఉండాలి. నా మొదటి సినిమా జోష్. అందులోనే జేడీ గారితో పరిచయం ఏర్పడింది. ఈ పాటను అందరూ చూసి విజయవంతం చేయండి' అని అన్నారు.

మంజూష దగ్గరికి వెళ్లు అంటూ: జయతిని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను అని రాంప్రసాద్ చెప్పడంతో.. ఆమెను దూరంగా చూస్తున్నావా అని జేడీ అంటే.. అవును.. కొందరిని దూరంగా ఉండి చూడాలి అని రాంప్రసాద్ సమాధానం ఇచ్చాడు. అయితే యాంకర్ మంజూష దగ్గరికి వెళ్లు అంటే.. లేదు.. ఆమెకు దూరంగానే ఉండాలి. ఎందుకంటే మీరన్నట్టు ఆమె పువ్వు కంటే సుతారంగా ఉంటారు అని రాంప్రసాద్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

Jabardasth Auto Ram Prasad satires on Anchor Manjusha at Na Friend demo Pelli music album

జోష్ సినిమా ఫ్లాప్ అవ్వడం: ఇదిలా ఉండగా, జేడీ చక్రవర్తితో కలిసి నా మొదటి సినిమా జోష్‌లో నటించాను. ఇప్పటికీ నాకు ఆయన గురువు లాంటి వారు అని రాంప్రసాద్ అంటే.. జోష్ సినిమా ఫెయిల్ అవ్వడం రాంప్రసాద్‌కు మంచి జరిగింది. ఆ తర్వాత నేను ఆయనను కలిసినప్పుడు అన్న.. నేను నీతో కలిసి జోష్ సినిమాలో నటించాను అని అంటే.. నీవు ఇంకా గుర్తున్నావు అంటూ ఆ షూటింగులో జరిగిన విషయాలు తెలియజేశాడు.

Jabardasth Auto Ram Prasad satires on Anchor Manjusha at Na Friend demo Pelli music album

రాంప్రసాద్‌కు అలా మంచి జరిగిందంటూ: అయితే జోష్ సినిమా గురించి జేడీ మాట్లాడుతూ.. జోష్ సినిమా ఆడి ఉంటే.. రాంప్రసాద్‌ అక్కడే ఉండిపోయేవాడు. ఆ సినిమా ఆడకపోవడం వల్లే రాంప్రసాద్ ప్రతిభ బయటపడింది. లేకపోతే హీరో స్నేహితుడిగానో.. మరో పాత్రల్లో ఉండిపోయేవాడు. ఆ సినిమా గురించి ఆడకపోవడమే మంచిదైంది అంటూ జేడీ చక్రవర్తి తనదైన శైలిలో వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X