ఓటమి అనేది నా హిస్టరీలోనే లేదు.. జబర్దస్త్ బ్యూటీ పంచ్ డైలాగ్స్.. మొత్తానికి జంప్

బుల్లితెరపై గత ఏడేళ్లుగా వినోదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది జబర్దస్త్ షో. ఈ ఖతర్నాక్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కళాకారులు ఫేమస్ అయ్యారు. కడుపుబ్బా నవ్వించే స్కిట్స్ వేస్తూ బుల్లితెర ఆడియన్స్‌ని గిలిగింతలు పెడుతూ కెరీర్‌కి పూలబాటలు వేసుకున్నారు. అయితే జబర్దస్త్ పార్టిసిపెంట్స్‌లో లేడీ గెటప్స్ వేసుకొని ఆడపిల్లగా అలరించిన సాయి తేజ.. ప్రస్తుతం ఆ షోకు దూరంగా ఉంటోంది. అయితే తాజాగా విడుదలైన ప్రోమో ప్రకారం ఆమె జబర్దస్త్ జంప్ అయినట్లుగా స్పష్టమవుతోంది.

 సాయి తేజ కాదు ప్రియాంక.. పింకీ

సాయి తేజ కాదు ప్రియాంక.. పింకీ

సాయి తేజగా లేడీ గెటప్పులో జబర్దస్త్ వినోదాలు పంచిన సాయితేజ.. ఇప్పుడు ప్రియాంకగా మారి పోయిన సంగతి తెలిసిందే. అంటే ఆడవారిగా మారేందుకు గాను సర్జరీ చేయించుకొని పూర్తి ఆడదానిగా అయిపోయాడు. గతంలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు.

జబర్దస్త్ హాట్ టాపిక్.. నాగబాబు బాటలో

జబర్దస్త్ హాట్ టాపిక్.. నాగబాబు బాటలో

అయితే గత వారం రోజులుగా జబర్దస్త్‌కి సంభందించిన ఎన్నో అంశాలు వైరల్ అవుతున్నాయి. ఎప్పుడైతే నాగబాబు జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పి వేరే ఛానెల్ కి వెళ్లారో అప్పటినుంచి జబర్దస్త్ హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. సరిగ్గా ఈ తరుణంలో జబర్దస్త్ సాయితేజ అలియాస్ ప్రియాంక ఓ ఛానెల్ ప్రోమోలో కనిపించి మరిన్ని అనుమానాలకు తెరలేపింది.

జబర్దస్త్ నుంచి జంప్.. గుండమ్మ కథ

జబర్దస్త్ నుంచి జంప్.. గుండమ్మ కథ

నిజానికి సాయితేజ అలియాస్ ప్రియాంక గత కొన్ని రోజులుగా జబర్దస్త్ షోకి దూరమైంది. జబర్దస్త్‌లో ఓ మెరుపు మెరిసి ఆ తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో ఆమె జబర్దస్త్ ఎంట్రీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు జనం. ఈ పరిస్థితుల్లో ఆమె జీ తెలుగులో ప్రసారం అయ్యే గుండమ్మ కథ సీరియల్‌‌లో కనిపించడంతో ఇక ఆమె జబర్దస్త్ నుంచి జంప్ అయినట్లే అని ఫిక్స్ అవుతున్నారంతా.

ఓటమి అనేది తన హిస్టరీలోనే లేదు

ఓటమి అనేది తన హిస్టరీలోనే లేదు

జీ తెలుగులో ప్రసారం కానున్న 'గుండమ్మ కథ' సీరియల్‌లో సాయి తేజ (ప్రియాంక)కు అవకాశం దక్కింది. సోమవారం నుంచి ఈ సీరియల్ ఎసిసోడ్‌లు ప్రసారం కానున్నాయి. ఈ సీరియల్‌లో రియాగా కనిపించబోతోంది సాయి పింకీ.
తాజాగా విడుదలైన ఈ సీరియల్ ప్రోమోలో ''ఓటమి అనేది తన హిస్టరీలోనే లేదు'' అంటూ అదిరిపోయే డైలాగ్స్‌తో అదరగొట్టింది ప్రియాంక.

Recommended Video

#CineBox : Jabardasth Effect On Nandamuri Balakrishna New Movie

మా అందరికీ ఓ గ్రూప్

లేడీగా రూపాంతరం చెందిన సాయితేజ.. వినోద్, శాంతో స్వరూప్, పవన్ లాంటి వాళ్లమంతా కలిసి ఓ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకున్నామని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దాని పేరు జబర్దస్త్ లేడీ గెటప్స్ అని పేర్కొన్న సాయితేజ (ప్రియాంక) ఆ గ్రూప్ ద్వారా తామంతా ఎప్పుడూ టచ్‌లో ఉంటామని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X