Don't Miss!
- News భక్తులకు గుడ్‌న్యూస్...తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ...
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఒక ఇంటివాడైన చమ్మక్ చంద్ర: రచ్చరవి పోస్ట్‌తోనే అందరికీ తెలిసింది
Recommended Video
జబర్దస్త్ కమెడియన్స్ అంతా ఓ కుటుంబంలా ఉంటారన్న విషయం తెలిసిందే. వీరంతా ఒక్కొక్కరుగా సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారు. సుధీర్, శ్రీను తదితరులు ఇటీవల సొంతింట్లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు చమ్మక్ చంద్ర వంతు. కమెడియన్‌గా ఎన్నో సినిమాలు చేసినప్పటికీ పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయాడు చంద్ర.
చంద్ర నూతన గృహ ప్రవేశం
ఒకవైపు ఆడవాళ్ళను తక్కువ చేస్తూనే, మరో పక్క వాళ్ళ విలువ ఏంటో చెబుతూ అందరి అభిమానాన్ని పొందుతున్నాడు .జబర్దస్త్ షో తో మంచి పాపులారిటి సంబంధించిన వాళ్ళలో ఒకడు చమ్మక్ చంద్ర. ఫ్యామిలి స్కిట్ తో కడుపుబ్బా నవ్వించే చంద్ర అంటే అందరు ఇష్ట పడతారు.
ఆడవాళ్ళను తక్కువ చేస్తూ
జబర్దస్త్‌తో చంద్రకు మంచి నేమ్.. ఫేమ్ ఇచ్చింది. ఇవాళ చంద్ర నూతన గృహ ప్రవేశం చేశాడు. ఈ కార్యక్రమం అంతా సింపుల్‌గా జరిగిపోయినట్టుంది. పెద్దగా ఆర్భాటంగానీ, సెలబ్రిటీల సందడీ, హడావిడీ లేకుండా సింపుల్‌గా గృహప్రవేశం చేసాడు చంద్ర. ఈ విషయం కూడా రచ్చరవి పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ తో అందరికీ తెలిసింది.
రచ్చ రవి
ఒక్క రచ్చ రవి మాత్రం కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తోంది. చంద్రకు జబర్దస్త్‌లో రవి మంచి హ్యాండ్. వీరిద్దరు కలిసి చేసిన స్కిట్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. దీంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది. దీంతోనే రచ్చ రవిని ఒక్కడినే తన గృహ ప్రవేశానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
ఆనందమానందమాయనే
చంద్ర గృహ ప్రవేశం అంటూ రవి ఓ ఫోటోను షేర్ చేశాడు. "ఆనందమానందమాయనే మా చంద్రన్న ఒక ఇంటి వాడు ఆయనే..." అంటూ రవి కామెంట్ పెట్టి చంద్ర గృహ ప్రవేశం సందర్భంగా దిగిన ఫోటోకు టాగ్ చేశారు. ఇక అక్కడ కామెంట్ల రూపంలో చంద్రకి అభినందనలు తెలుపుతున్నారు చంద్ర ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు.