జబర్దస్త్ చంటికి రోడ్ ఆక్సిడెంట్.. లారీని ఢీ కొట్టిన కారు
Recommended Video
ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులను ప్రమాదాల వార్తలు తీవ్రంగా కలచి వేస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రమాదాల వార్తలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాన్ని తాజాగా జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి కారు ప్రమాదం వార్త మరింత కలవర పెడుతోంది. సూర్యాపేట జిల్లాలో చంటి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆయన తీవ్ర గాయాలతో బయటపడ్డారు. పూర్తి వివారాలు చూస్తే..

కోదాడ వద్ద కారు ప్రమాదం
ఈ రోజు (మంగళావారం) ఉదయం సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి ఓ లారీని బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చంటి తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.

హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
ప్రమాదం జరిగిన వెంటనే గుమిగూడిన జనం గాయపడింది జబర్దస్త్ చంటి అని గుర్తించారు. ఆయన్ను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక కోదాడ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు.

విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా
నిన్న విజయవాడ వెళ్లిన చంటి ఈ రోజు ఉదయమే కారులో హైదరాబాద్ బయల్దేరాడు. అయితే విజయవాడ నుంచి హైదరాబాద్ మార్గం మధ్యలో ఉదయం ఆరున్నర గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గతంలో కూడా చంటి ఇలాగే రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

చలాకీ చంటిగా మంచి గుర్తింపు
ఈ టీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చంటి. చలాకి చంటిగా ఆయన వేసిన స్కిట్లు బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. దీంతో చంటి ప్రమాద వార్త విని షాక్ అవుతున్నారు జనం. చంటికి సంబంధించి తదుపరి సమాచారం అందాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











