32 లో మొదలై 35 లో ఫినిష్.. మూడేళ్ల కష్టం మాటల్లో చెప్పలేం..సుడిగాలి సుధీర్ ఎమోషనల్
బుల్లితెర మీద జబర్దస్త్ రియాలిటీ షోతో విశేషంగా అభిమానులను సంపాదించుకొన్న కమెడియన్ సుడిగాలి సుధీర్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కాలింగ్ సహస్త్ర. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ బ్యానర్లపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కటూరి ఈ సినిమాను నిర్మించారు. సుధీర్ సరసన డాలిశ్య హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో కలయా నిజమా.. అనే అనే లిరికల్ సాంగ్‌ను బుధవారం మీడియా మిత్రుల చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ..
మా టీమ్ తరపున సాంగ్ లాంచ్ చేసిన మీడియా ఫ్యామిలీకి థాంక్స్. మోహిత్, లక్ష్మీ ప్రియాంకగారికి థాంక్స్. చిత్రమ్మగారి ఆశీస్సులు మాకెప్పుడూ ఉంటాయి. సన్నీ బ్యూటీఫుల్ విజువల్స్ అందించారు. మా నిర్మాతలు విజేష్, వెంకట్, చిరంజీవి గారికి థాంక్స్. మూడేళ్ల కష్టం ఈ సినిమా. చాలా స్ట్రగుల్స్ దాటి ఈ స్టేజ్‌కి చేరుకున్నాం అని సుడిగాలి సుధీర్ అన్నారు.
మా డైరెక్టర్ అరుణ్‌గారు కథ చెప్పే సమయంలో బ్లూటూత్ స్పీకర్‌తో మ్యూజిక్ ప్లే చేస్తూ కథను చెబుతూ వచ్చారు. అంత రేంజ్‌లో మూడ్ క్రియేట్ చేస్తూ ఇన్‌టెన్స్‌తో సినిమా చేశారు. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ జోనర్‌లో చేసిన సినిమా ఇది. నాపై నమ్మకంతో సినిమా చేసిన డైరెక్టర్, నిర్మాతలకు ధన్యవాదాలు అని సుడిగాలి సుధీర్ తెలిపారు.

కాలింగ్ సహస్ర సినిమా నాకు 32 ఏళ్లు ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ప్రస్తుతం నాకు 35 ఏళ్లు. అంటే ఈ సినిమా మూడేళ్ల కష్టం. ప్రతి సినిమాకు కష్టపడుతాం. ఈ సినిమాకు కూడా రకరకాల కష్టాలు వచ్చాయి. అలాంటి కష్టాలను దాటుకొంటూ ఈ సినిమా పూర్తి చేశాం. ఈ సినిమాకు మంచి సపోర్ట్ ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు అని సుడిగాలి సుధీర్ తెలిపారు.
శివబాలాజీ అన్న అడగ్గానే వచ్చేవారు. షూటింగ్ ఎక్స్‌టెండ్ అయినా మరో రోజు వచ్చి చేస్తానని చెప్పేవారు. ఈ సినిమా కథలో ఇన్‌వాల్వ్ అయ్యారు. సీనియర్ అయినప్పటికీ శివ బాలాజీ అందించిన సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న సినిమాకు ఆయన అందించిన ప్రోత్సాహం. ప్రతీ విషయంలో శివ బాలాజీ అందించిన సహకారం మరువలేనిది.

హీరోయిన్ డాలిశ్యగారు వండర్‌ఫుల్ నటి. టీమ్ అందరం ఫ్యామిలీలా కలిసిపోయి యాక్ట్ చేశాం. సినిమా ఫైనల్ స్టేజ్‌లో గ్యారీ గారు సపోర్ట్ చేయటానికి వచ్చారు. ఆయనకు స్పెషల్ థాంక్స్. మార్క్ కె.రాబిన్‌గారికి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా గొప్పగా ఇచ్చారు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి మెంబర్‌కి థాంక్స్ అని సుడిగాలి సుధీర్ అన్నారు.


Click it and Unblock the Notifications











