జబర్దస్త్‌కి దూరం కావడానికి కారణమిదే.. అసలు విషయం బయటపెట్టిన వినోద్!

Recommended Video

Jabardasth Vinod Comments On The TV Show || అసలు విషయం బయటపెట్టిన వినోద్!

బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కళాకారులు ఫేమస్ అయ్యారు. కడుపుబ్బా నవ్వించే స్కిట్స్ వేస్తూ బుల్లితెర ఆడియన్స్‌ని గిలిగింతలు పెడుతూనే ఉన్నారు. రోజుకో కొత్త రకం స్కిట్.. అప్‌డేట్ నవ్వులు అన్నట్లుగా సాగుతోంది జబర్దస్త్ షో. అయితే జబర్దస్త్ పార్టిసిపెంట్స్‌లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న పేరు వినోద్. గత కొన్ని రోజులుగా జనం నోళ్ళలో నానుతూ వస్తున్న ఈయన తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని సీక్రెట్ బయటపెట్టేశాడు. ఆ వివరాలు చూస్తే..

ఎంటర్‌టైన్‌మెంట్ రంగం నుంచి ఈ ఇద్దరూ

ఎంటర్‌టైన్‌మెంట్ రంగం నుంచి ఈ ఇద్దరూ

ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ అధినేత జ‌గ‌న్ పాదయాత్రలో ఎంటర్‌టైన్‌మెంట్ రంగం నుంచి వాళ్లు చాలామంది పాల్గొన్నారు. అందులో జబర్దస్త్ కమెడియన్లు శాంతి స్వరూప్, వినోద్‌లు కూడా ఉన్నారు. పాదయాత్రలో భాగంగా లేడీ గెటప్పులతో ఏపీ ప్రజలను ఎంటర్‌టైన్‌ చేస్తూ జగన్‌కి సపోర్ట్‌గా నిలిచారు ఈ ఇద్దరూ.

జబర్దస్త్ జర్నీకి బ్రేక్ పడింది అందుకే

జబర్దస్త్ జర్నీకి బ్రేక్ పడింది అందుకే

దీంతో ఆ స‌మ‌యంలో వీరిద్దరి జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో జర్నీకి కాస్త బ్రేక్ పడింది. దాదాపు మూడు నెల‌ల పాటు బుల్లితెరపై వీరి నవ్వులు కనుమరుగయ్యాయి. కాస్త పాపులారిటీ కూడా దెబ్బతింది. అయితే ఈ విషయమై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన శాంతి స్వరూప్.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వెళ్లి తప్పుచేశామని, అందువల్లనే జబర్దస్త్ జర్నీకి బ్రేక్ ఇవ్వక తప్పలేదని చెప్పారు.

 అసలు కారణం అది కాదు

అసలు కారణం అది కాదు

కానీ ఇప్పుడు జబర్దస్త్ వినోద్ ఇదే విషయమై మరోలా స్పందించాడు. జ‌గ‌న్ పాద‌యాత్రకు వెళ్లడం కారణంగానే తమకు జబర్దస్త్ షోలో అవకాశాలు రాలేదని చెప్పడం తప్పు అని పేర్కొన్నాడు. జగన్ పాదయాత్రకు వెళ్లిన కారణంగా తనను జబర్దస్త్ నుంచి పక్కన బెట్టలేదని, దానికి వేరే కారణాలున్నాయని అన్నాడు.

 ఇచ్చిన డేట్స్‌ ప్రకారం

ఇచ్చిన డేట్స్‌ ప్రకారం

జబర్దస్త్ టీమ్ ఇచ్చిన డేట్స్‌ ప్రకారం ఫాలో కాలేకపోయానని, అందుకే తనను జబర్దస్త్ నుంచి దూరం పెట్టేసారని వినోద్ అంటున్నాడు. అంతేగానీ ఈ విషయంలో జబర్దస్త్ డైరెక్షన్ టీం తప్పు ఏ మాత్రం లేదని అన్నాడు. త్వరలోనే తిరిగి జబర్దస్త్ తెరపై దర్శనమిస్తానని అతను చెప్పాడు.

 ఇటీవలే వినోద్‌పై దాడి.. ఇప్పుడిప్పుడే

ఇటీవలే వినోద్‌పై దాడి.. ఇప్పుడిప్పుడే

వినోద్ అలియాస్ వినోదినిపై ఇటీవలే దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆస్తి కొనుగోలు విషయమై జరిగిన గొడవ కారణంగా ఈయనపై దాడి జగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత చికిత్స తీసుకొని కాస్త కోలుకున్న ఈయన ఇప్పుడిప్పుడే కెరీర్ గురించి ఆలోచిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X