Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చాలా భయంగా ఉంది.. ప్రతీ రోజు ఏడుస్తూనే ఉన్నా.. జబర్దస్త్ వినోద్ తీవ్ర ఆవేదన
జబర్దస్త్ ఫేమ్ వినోద్ అలియాస్ వినోదినిపై ఇటీవల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆస్తి కొనుగోలు విషయమై జరిగిన జరిగిన గొడవ కారణంగా ఈయనపై దాడి జగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత చికిత్స తీసుకొని కాస్త కోలుకున్న వినోద్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన ఆవేదన వెలిబుచ్చాడు. పూర్తి వివరాల్లోకి పోతే..
Recommended Video
కాచిగూడలో వినోద్‌పై దాడి
కాచిగూడలోని కుత్బిగూడాలో ఇంటి ఓనర్, కొందరు దుండగులు కలిసి చేసిన దాడిలో వినోద్ త్రీవంగా గాయపడ్డారు. తలపై, ముఖంపై బలమైన గాయాలు కావడంతో స్నేహితులు ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. కొద్ది రోజుల పాటు చికిత్స తీసుకున్న వినోద్ ప్రస్తుతం కోలుకొని తనపై జరిగిన దాడి, దాని పర్యవసనాల తాలూకు వివరాలు తెలిపాడు.
కన్ను సరిగ్గా కనిపించడం లేదు
దాడి జరిగిన ఓ కన్ను సరిగ్గా కనిపించడం లేదని చెబుతూ తీవ్ర ఆవేదన చెందాడు వినోద్. తాను లేడీ గెటప్పులో రాణించడానికి ముఖ్య కారణం తన కళ్లే అని, ఆ కళ్లలో ఒకటి చిన్నగా అయిపోవడం అదేవిధంగా సరిగ్గా కనిపించకపోవడంతో తనకు భయమేస్తుందని తెలిపాడు.
రోజు చూసుకుంటూ ఏడుపే
తన కన్ను చిన్నగా అయిందని అందరూ అనుకుంటున్నారు. ఇక తనకు లేడీ గెటప్ సూట్ కాదని భావిస్తున్నారు. దీంతో ఇక అవకాశాలు కూడా రావేమో అని భయం వేస్తోంది. ఆ కన్నును రోజూ అద్దంలో చూసుకుని ఏడుస్తున్నాను అంటూ విలపించాడు వినోద్.
10 లక్షలు అడ్వాన్స్ ఇవ్వగా
తాను ఉంటున్న ఇల్లు కొందామని ఇంటి ఓనర్‌కి 10 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చానని, అయితే ఇంటి రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని వారిని అడగగా రేపు మాపు అంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చారని వినోద్ అన్నాడు. దీంతో రిజిస్ట్రేషన్ అయినా చేయించండి లేదా నా డబ్బు అయినా వెనక్కి తిరిగివ్వండి అని వారిపై ఒత్తిడి తెచ్చానని, ఈ నేపథ్యంలో నాపై కక్ష్య కట్టి దాడి చేశారని వినోద్ చెప్పాడు.
సరే సెటిల్మెంట్ చేసుకుందాం అని చెప్పి
ఓకే నీ 10 లక్షలు ఇవ్వడమా లేక ఇల్లు రిజిస్ట్రేషన్ చేయడమా.. ఏదో ఒకటి సెటిల్ చేసుకుందామని నమ్మించి నాపై ఇలా దాడికి పాల్పడ్డారని ఆవేదన చెందాడు వినోద్. ఇంటి పైకి పిలిచి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారని, నీ 10 లక్షలు ఇవ్వం, ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ చేయం అంటూ దౌర్జన్యం చేశారని చెబుతూ ఆవేదన చెందాడు వినోద్.