జబర్దస్త్ కామెడీ కాదు...నిజంగానే పవన్ కళ్యాణ్ దేవుడే!
జబర్దస్త్ షోలో పవనిజం కాన్సెప్టు అనగానే..... అక్టోబర్ 31న ప్రసారం అయ్యే షోపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అన్నయ్య నాగబాబు ముందు పవన్ కళ్యాణ్ ఫోటోతో కామెడీ పండించడం అనే ఆలోచన కూడా అందరినీ ఆకర్షిస్తోంది. గురువారం ఎప్పుడొస్తుందా? అని పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
జబర్దస్త్ షో సంగతి పక్కన పెడితే.....పవన్ కళ్యాణ్ నిజంగానే కొందరి పాలిట దేవుడుగా మారాడనేది అభిమానుల అభిప్రాయం. ప్లాపుల బాటలో ఉన్న యువ హీరోలను హిట్ బాటలో నడిపించి దేవుడయ్యాడు. నిర్మాతలకు కనక వర్షం కురిపించి దేవుడు అయ్యాడు. మొత్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ రేంజిని పెంచి ధీరుడయ్యాడని అంటున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం రికార్డు కలెక్షన్లతో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. రూ. 100 కోట్ల దిశగా దూసుకెలుతున్న ఈచిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ మార్కెట్ రేంజి ఏమిటో నిరూపిస్తోంది. రాముడు చెబితే తప్ప హనుమంతుని శక్తి ఏమిటో బయట పడలేదు అనే చందంగా.....పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమా వచ్చే దాకా తెలుగు సినిమా మార్కెట్ పరిధి రేంజి ఇంత స్థాయిలో ఉందనేది తెలియలేదు అని అంటున్నారు అభిమానులు.
తాజాగా అత్తారింటికి దారేది చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో సరికొత్త బెంచ్ మార్కును అందుకుంది. ఈచిత్రం ఓవర్స్ వసూళ్లలో రూ. 20 కోట్లను అధిగమించింది. ఒక్క అమెరికాలోనే ఈచిత్రం రూ. 14 కోట్లుకు పైగా వసూలు చేసింది. యూకె. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, సింగపూర్ లాంటి దేశాల్లో మొత్తం కలిపి రూ. 6 కోట్లకు పైగా రాబట్టింది.


Click it and Unblock the Notifications












