చిరు-పవన్ ఇష్యూతో నాగబాబు వాకౌట్, ఏడ్చేసిన రోజా, కొట్టుకున్న కమెడియన్లు!

జబర్దస్త్ దసరా మహోత్సవం ఆసక్తిగా సాగబోతోంది. సెప్టెంబర్ 30న ఈ షో ప్రాసారం కాబోతోంది.

By Bojja Kumar

Recommended Video

చిరు-పవన్ ఇష్యూతో నాగబాబు వాకౌట్ ఏడ్చేసిన రోజా, Jabardasth Dasara Mahostavam Event Promo

తెలుగు టీవీ రంగంలో 'జబర్దస్త్', 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' కామెడీ షోలు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాగబాబు, రోజా న్యాయ నిర్ణేతలుగా, అనసూయ, రష్మి లాంటి హాట్ బ్యూటీస్ యాంకరింగ్ చేస్తున్న ఈ షోలు తెలుగు టీవీ ఎంటర్టెన్మెంట్ రంగంలో కొన్నేళ్లుగా తిరుగులేని ఆధిపత్యం సాగిస్తున్నాయి.

అయితే దసరా సందర్భంగా 'జబర్దస్త్' షోను ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. 'దసరా మహోత్సవం' పేరుతో ఈ ఈవెంటును గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. సెప్టెంబర్ 30న ప్రసారం అయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో చూపించిన కొన్ని సీన్లు ప్రేక్షకులు షాకయ్యేలా చేశాయి.

అందమైన ఫ్యామిలీ అంటూనే...

అందమైన ఫ్యామిలీ అంటూనే...

ఈ ప్రోమోలో.... మాది అందమైన ఫ్యామిలీ అంటూ కొన్ని సీన్లు చూపించడం, అంతలోని జబర్దస్త్ కమెడియన్లు కొట్టుకోవడం లాంటివి కనిపించాయి. చాలా ఆసక్తికరంగా ఈ షో సాగనుందని ఈ ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది.

కోహినూర్ వజ్రం అంటూ రోజాపై నాగబాబు

కోహినూర్ వజ్రం అంటూ రోజాపై నాగబాబు

ఓ సీన్లో నాగబాబు మాట్లాడుతూ.... బ్రిటిష్ వాడు కోహినూర్ వజ్రం ఎత్తుకెళ్లింది అని చెప్పింది ఎవరు? ఇదిగో ఇక్కడ ఉంది కోహినూర్ డైమండ్ అంటూ రోజాను ఉద్దేశించి నాగబాబు కామెంట్ చేయడం, రోజా సిగ్గుమొగ్గవ్వడం కనిపించింది. దీన్ని బట్టి షో చాలా ఎంటర్టెనింగ్‌గా సాగుతుందని తెలుస్తోంది.

వాకౌట్ చేసిన

వాకౌట్ చేసిన

షో జరుగుతుండగా జబర్దస్త్ కమెడియన్ల మధ్య ఏదో చిన్న గొడవ జరిగింది. దీంతో సుడిగాలి సుధీర్ నాగబాబును నిలదీశారు. ముందు నుండీ ఉన్న చిరంజీవిగారా? మధ్యలో వచ్చిన పవన్ కళ్యాణ్ గారా? అంటూ సుధీర్ ఓ ప్రశ్నవేయడంతో నాగబాబు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. షో నుండి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.

ఏడ్చేసిన రోజా

ఏడ్చేసిన రోజా

ఆ పార్టీ ఈ పార్టీ మార్చడం కాదు... ఏదో ఒక పార్టీలో ఉండాలంటూ రోజా మీద కొందరు కమెడియన్లు విమర్శలు చేశారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ రోజా ఎమోషన్ అయ్యారు. ఏడ్చేశారు. తాను ఎమ్మెల్యే అయ్యానంటే దానికి కారణం జబర్దస్త్ షో మాత్రమే అని స్పష్టం చేశారు.

కళ్లు తిరిగి పడిపోయిన అనసూయ

కళ్లు తిరిగి పడిపోయిన అనసూయ

షో మధ్యలో అనసూయ కళ్లు తిరిగి పడిపోవడం, నాగబాబు, ఇతరలంతా కలిసి ఆమెను పట్టుకోవడం కనిపించాయి. మొత్తానికి దసరా మహోత్సవం చాలా రసవత్తరంగా సాగుతుందని స్పష్టమవుతోంది.

ప్రోమో ఇదే...

సెప్టెంబర్ 30న ప్రసారం కాబోతున్న జబర్దస్త్ దసరా మహోత్సవానికి సంబంధించిన ప్రోమో ఇదే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X