టర్నింగ్ పాయింట్ అవుతుందా?: పెద్ద ప్రయోగమే చేస్తున్న చమ్మక్ చంద్ర..(వీడియో)
Recommended Video

నా పెర్ఫార్మెన్స్ ఇండస్ట్రీకి పనికిరాదా? అని బాధపడ్డ రోజుల నుంచి.. జబర్దస్త్ అనే టీవి షో అంతలా హైలైట్ అవడానికి.. మెయిన్ పిల్లర్‌లా నిలబడ్డాడు చమ్మక్ చంద్ర. ఈ ఒక్క మాట చాలు అతని సక్సెస్ గురించి చెప్పడానికి.
ఒకప్పుడు అవకాశాల్లేక రోడ్లపై తిరిగిన స్టేజీ నుంచి ఇప్పుడు వెండితెరపై కూడా మెరుస్తున్నాడు. అయితే బుల్లితెరపై వచ్చినట్లుగా వెండితెరపై సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఇంతలోనే.. కామెడీ నుంచి విలన్ రూట్ లోకి కూడా వెళ్లి పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు చంద్ర.

తమిళ సినిమాలో..:
తెలుగులో పూర్తి స్థాయి పాత్రల్లో కనిపించే అవకాశాలేవి చమ్మక్ చంద్రకు రాలేదు. ఇలాంటి తరుణంలో కోలీవుడ్ నుంచి చంద్రకు ఫుల్ లెంగ్త్ రోల్ ఆఫర్ రావడం విశేషం.

చంద్రలో ఈ యాంగిల్ కూడా!:
సెయల్ పేరుతో తెరకెక్కుతున్న తమిళ సినిమాలో చంద్ర విలన్ పాత్రలో దర్శనమివ్వబోతున్నాడు. ఇప్పటిదాకా తనలోని కామెడీ యాంగిల్ మాత్రమే చూసిన జనాలు.. చంద్రలో ఈ యాంగిల్ కూడా ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు.

మెప్పిస్తాడా?:
కామెడీ అంటే చమ్మక్ చంద్రకు కొట్టిన పిండి. కానీ వెండితెరపై విలన్ పాత్ర మాత్రం ఇదే తొలిసారి. అది కూడా పూర్తి స్థాయి పాత్రలో. దీంతో విలన్ పాత్రలో చంద్ర ఎంతమేర మెప్పిస్తాడోనన్న ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో చంద్ర విలన్ లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

కెరీర్ మలుపు తిరుగుతుందా?:
ఒకవేళ సెయల్ సినిమాలో చంద్ర విలన్ పాత్రకు గనుక మంచి మార్కులు పడితే.. భవిష్యత్తులో టాలీవుడ్ లోనూ అలాంటి పాత్రలు చంద్రను వరించవచ్చు. ఆవిధంగా చంద్ర చేస్తున్న విలన్ రోల్ ఆయన కెరీర్ మలుపు తిప్పే అవకాశం లేకపోలేదు.
సినిమా వివరాలు:
రవి అబ్బులు దర్శకత్వంలో 'సెయల్' సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రాజన్ తేజేశ్వర్, థరుషి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సిద‍్ధార్థ్ విపిన్ సంగీతం అందిస్తుండగా.. సీఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై సీఆర్ రాజన్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











