Jabardasth: బతికి ఉండగానే చంపేస్తున్నారు.. వాళ్ళపై బాధతో ఎమోషనల్ అయిన కమెడియన్ అప్పారావు

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్న సినిమాల్లో కూడా అవకాశాలు అందుకున్న నటీనటులుల్ లిస్ట్ పెద్దగానే ఉంది. ఇక అందులో అప్పారావు కూడా ఉన్నాడు. మొదట అతను సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని అవకాశాలు అందుకున్నాడు. కానీ ఏది కూడా అంతగా క్లిక్ అవ్వలేదు. ఇక ఎప్పుడైతే అతను జబర్దస్త్ లోకి అడుగుపెట్టాడో అప్పటినుంచి అతని కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది.

అయితే అప్పారావు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఎమోషనల్ అయ్యాడు. నటులు బ్రతికి ఉండగానే చంపేస్తున్నారు అంటూ కొందరు చేస్తున్న పద్ధతి ఏమాత్రం కరెక్ట్ గా లేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పారావు ఎవరిమీద ఆవేదన వ్యక్తం చేశారు అనే వివరాల్లోకి వెళితే...

Jabardasth fame Comedian apparao latest news viral

జబర్దస్త్ లో బిజీబిజీగా: జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునందుకున్న అప్పారావు చాలామంది టీం లీడర్స్ తో కలిసి పని చేశాడు. ఎక్కువగా చలాకీ చంటితో వర్క్ చేసిన తను ఆ తర్వాత సుధీర్ తో కూడా కలిసి కొన్నాళ్లపాటు షోలు చేసుకుంటూ వచ్చాడు. ఇక చమ్మక్ చంద్ర టీమ్ లో కూడా వర్క్ చేశాడు. కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా ఈటీవీ లో ప్రసారమయ్యే ఇతర కొన్ని షోలలో కూడా అతను ప్రత్యేకంగా కామెడీ చేస్తూ అందరిని నవ్విస్తున్నాడు.

డైలాగ్స్ లేని రోల్స్ మాత్రమే దొరికేవి: దాదాపు 2013 నుంచి కూడా అతను జబర్దస్త్ లో కొనసాగుతూనే ఉన్నాడు. అయితే అంతకుముందు అప్పారావు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలం కోసం ఎంతగానో ప్రయత్నాలు చేశాడు. కెరీర్ స్టార్టింగ్ లో అయితే అప్పారావుకు డైలాగ్స్ లేని రోల్స్ మాత్రమే దొరికేవి. ఇక తర్వాత మెల్ల మెల్లగా కొంచెం చిన్న సినిమాల్లో పనివాడు పాత్రలు చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత రియాల్టీ షోలు మొదలైన తరువాత అటువైపు కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

Jabardasth

రెమ్యునరేషన్ విషయంలో: ఇక అప్పారావు ఆ మధ్యకాలంలో జబర్దస్త్ పై చేసిన వ్యాఖ్యలు కూడా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. అందులో కొందరి కారణంగా కమెడియన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు అని కూడా అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా రెమ్యునరేషన్ విషయంలో అయితే కొంత అన్యాయం జరిగింది అని ఆ కారణంగానే తాను బయటకు వెళ్లి వచ్చినట్లుగా అప్పారావు తెలియజేశాడు.

బ్రతికుండగానే చంపేస్తున్నారు: ఇక అప్పారావు ఇటీవల యూట్యూబ్లో వస్తున్న కొన్ని వార్తలపై ఊహించిన విధంగా రియాక్ట్ అయ్యారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది తప్పుగా వ్యవహరిస్తున్నారు అని కొంతమంది సెలబ్రిటీలు బ్రతికున్న కూడా చనిపోయారు అంటూ అనేలా వార్తలు ప్రచారం చేస్తున్నట్లుగా అప్పారావు తెలియజేశారు.

Jabardasth

ఇక యూట్యూబ్ వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఇప్పుడు వినాలి అంటూ మీ వల్ల చాలామంది మనోవేదనకు గురి అవుతున్నారు. ప్రసిద్ధ నటీనటులు బ్రతికుండగానే చంపేస్తున్నారు. అలా థంబ్ నెయిల్స్ పెడితే చూస్తారు.. అని ఆలోచించడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పడానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా ఇతరుల జీవితాలతో ఆడుకోవద్దు అని ఆయన ఆవేదనగా తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X