కమెడియన్ ధనరాజ్ ను రోడ్డున పడేసిన స్టార్ యాంకర్.. నమ్ముకుంటే అడ్డంగా ముంచేసి..!
బుల్లితెరపై నిత్యం ఎన్నో సీరియల్స్, ఇతర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే మనసులో చిరకాలం గుర్తుండిపోతాయి, అలాంటి వాటిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఈ కోవకే వస్తుంది జబర్దస్త్. ఈటీవీలో ఎలాంటి అంచనాలు లేకుండా మొదలైన ఈ షో చాలా త్వరగానే తెలుగు బుల్లితెరపై టాప్ షోగా క్రేజ్ తెచ్చుకుంది. ప్రతి గురు, శుక్రవారం రాత్రి 9.30 గంటలకు వచ్చే ఈ షో కోసం ఇంటిల్లిపాది టీవీలు అతుక్కుపోయేవారంటే అతిశయోక్తి కాదు. టీఆర్పీ విషయంలో జబర్దస్త్ దరిదాపుల్లోకి కూడా ఏ షో వచ్చేది కాదు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా .. జబర్దస్త్ తరహా కంటెంట్‌తో కొన్ని ఛానెల్స్ కామెడీ ప్రోగ్రామ్‌ను క్రియేట్ చేసినా పెద్దగా సక్సెస్ కాలేదు. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలు కొన్నేళ్ల పాటు అప్రతిహతంగా దూసుకుపోయాయి.
ఈ షో ద్వారా అనసూయ, రష్మీలు స్టార్ యాంకర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. రష్మీ యాంకర్‌గా స్థిరపడిపోగా.. అనసూయ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా మారిపోయారు. నాగబాబు- రోజాలను ఈ ప్రోగ్రామ్ ఆర్ధికంగా నిలబెట్టిందని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. షకలక శంకర్, సుడిగాలి సుధీర్, వేణు, హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ వంటి వారు జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్‌తో సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. ఇలాంటి వారిలో ఒకరు ధన్‌రాజ్. జబర్దస్త్ ప్రారంభించిన తొలినాళ్లలోనే టీమ్ లీడర్‌గా మంచి స్కిట్లతో అలరించిన అతను తర్వాతి కాలంలో సినిమాల్లో అవకాశాలు సొంతం చేసుకున్నాడు.

భీమిలి కబడ్డి జట్టు, పిల్ల జమీందార్, అత్తారింటికి దారేది, మడత కాజా, అలా మొదలైంది, గబ్బర్ సింగ్, కెమెరామెన్ గంగతో రాంబాబు, గోపాల గోపాల, రాజుగారి గది, ఎక్స్‌ప్రెస్ రాజా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, భాగమతి, కథనం, ఓ బేబీ వంటి సినిమాలతో ధన్‌రాజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నటుడిగానే స్థిరపడిపోకుండా నిర్మాత, దర్శకుడిగానూ అవతారమెత్తాడు. అయితే నిర్మాతగా ధన్‌రాజ్ ఆర్ధికంగా నష్టపోయాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
తనే హీరోగా, స్టార్ యాంకర్ శ్రీముఖి హీరోయిన్‌గా 'ధనలక్ష్మీ తలుపు తడితే ' అనే సినిమాను నిర్మించారు ధన్‌రాజ్. ఇందుకోసం తను సంపాదించిన దంతా ఖర్చు చేయగా.. అప్పటికీ బడ్జెట్ సరిపోకపోవడంతో తన స్నేహితుల దగ్గర అప్పు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి సినిమాను రిలీజ్ చేయగా.. చూసిన వారందరూ బాగుందని పాజిటివ్ రివ్యూలు ఇచ్చారని.. ఒక వారం రోజుల వరకు బాగానే ఆడిందని ధన్‌రాజ్ తెలిపారు.

తాను ఒక సినిమా షూటింగ్ నిమిత్తం రాజస్థాన్‌లో ఉండగా ఓ రోజున శ్రీముఖి ఫోన్ చేసి మన సినిమా బాగుందని, థియేటర్స్‌లో టికెట్స్ దొరకడం లేదని చెప్పింది. ఆమె మాటలు విని చాలా సంతోషంగా అనిపించిందని ధన్‌రాజ్ తెలిపారు. అయితే అంతా బాగుంది అనుకుంటున్న వేళ.. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా అప్పుడే థియేటర్లలోకి అడుగుపెట్టిందని చెప్పారు.
ముందస్తు అగ్రిమెంట్ ఉండటంతో ధనలక్ష్మీ తలుపు తడితే సినిమాను వారానికే లేపేశారని .. దీంతో తనకు భారీ నష్టాలు వచ్చాయని ధన్‌రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే హీరోయిన్‌గా శ్రీముఖి ఉండటం వల్లే ఈ సినిమా అంతగా ఆడలేదని.. ఆమెకు బదులుగా ఎవరైనా టాప్ హీరోయిన్ ఇందులో నటించి ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ వేరేలా ఉండేదంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆర్ధికంగా నష్టాలు చుట్టుముట్టినా ధన్‌రాజ్ భయపడకుండా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు సముద్రఖనితో కలిసి రామం రాఘవం సినిమాను తెరకెక్కిస్తున్నారు ధన్‌రాజ్.


Click it and Unblock the Notifications











