AP Elections 2024 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్‌కు అలాంటి గతి.. కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు... తేడా కొడితే
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఓటర్లు దేశ విదేశాల నుంచి స్వగ్రామాలకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లంతా కసిగా ఓటేశారని ప్రతి ఒక్క చోటా వినిపిస్తోంది. ఆ కసి అధికార పక్షం మీదా, లేక కూటమిపైనా అన్నది మాత్రం ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఎన్ని పనులున్నా పక్కనబెట్టి అర్ధరాత్రి వరకు క్యూలైన్‌లలో వేచి ఉండి జనం ఓట్లేయడం, భారీగా పోలింగ్ నమోదు కావడంతో ప్రధాన పార్టీలు వేటికవే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎప్పుడూ రాజకీయాలు, వ్యూహ ప్రతి వ్యూహాలతో క్షణం తీరిక లేకుండా గడిపే మన నేతలు కాస్త టైం దొరికే సరికి ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు.
ఇదిలావుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలపై పలు సర్వేలు, ముందస్తు అంచనాలు వెలువడుతూనే ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల సంఘం జూన్ 2 వరకు నిషేధం విధించగా .. సోషల్ మీడియాలో మాత్రం రకరకాల సర్వేలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్నింట్లో జగన్ గెలుపు ఖాయమంటే.. మరికొన్నింటిలో మాత్రం కూటమితే అధికారమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 4 కోసం నేతలు, అభ్యర్ధులు, ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 145 నుంచి 160 సీట్లు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. అంతేకాదు.. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఏపీలో అడుగుపెట్టిన వెంటనే లాక్కెళ్లి లోపల పడేస్తారని ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీంతో నెటిజన్లు ఆర్పీని ఆడుకుంటున్నారు. నువ్వు చెప్పినట్లు కూటమికి 145 సీట్లు వస్తే పర్లేదు.. ఒకవేళ రాకపోతే నీ పరిస్ధితి ఏంటని హెచ్చరిస్తున్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, జూన్ 4 రోజున ఎవరి సత్తా ఏంటో చూద్దామని చురకలంటిస్తున్నారు. రిజల్ట్స్ తర్వాత నువ్వు కనిపిస్తావా , తేడా కొడితే ఏపీలో నీ షాప్ ఒక్కటి కూడా ఉండదని ఆర్పీని ఏకీపారేస్తున్నారు.

కాగా.. ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున విస్తృతంగా ప్రచారం చేశారు కిరాక్ ఆర్పీ. కూటమికి ఎందుకు ఓటేయాలో తనదైన శైలిలో చెబుతూ దూసుకెళ్లారు. వైసీపీ నుంచి వచ్చిన విమర్శలకు కూడా స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. అన్నింటిలోకి పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేసిన జబర్దస్త్ నటులపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై ఆర్పీ సీరియస్‌గా స్పందించారు. వారు చిన్న నటులు , చిన్న ప్రాణాలని రోజా వ్యాఖ్యానించారు. మెగా ఫ్యామిలీ ఆగ్రహానికి గురైతే ఇండస్ట్రీలో మనుగడ సాగించలేమని వారు భయపడుతున్నారని.. అందుకే పవన్ కోసం ప్రచారం చేస్తున్నారని రోజా ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కిరాక్ ఆర్పీ రంగంలోకి దిగారు. వాళ్లంతా చిన్న ఆర్టిస్టులైతే .. రోజాకు 15 నేషనల్ అవార్డులు, 10 ఆస్కార్ అవార్డులేమైనా వచ్చాయా అని రోజాను ప్రశ్నించారు. నీకు దమ్ముంటే గెటప్ శ్రీను వేసే క్యారెక్టర్లు నీ జీవితంలో ఒక్కటైనా వేయగలవా..? సుడిగాలి సుధీర్ కష్టపడి పైకొచ్చాడని, నీకంటే 10 రెట్లు ఫాలోయింగ్ వుందని వాడితో పోటీపడగలవా , ఆదిలా గంటల తరబడి నవ్వించగలవా.. నీ బతుకులో వీరి ఛరిష్మాను చూశావా అని రోజాపై కిరాక్ ఆర్పీ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అందరికంటే ఓడిపోయేది రోజాయేనని, ఆమెకు డిపాజిట్లు కూడా రావన్నారు. ప్రచారం, పోలింగ్ ముగిసిన తర్వాత కూడా రాజకీయాల్లో అంతే యాక్టీవ్‌గా ఉన్నారు ఆర్పీ. ఫలితాల సరళిపై యూట్యూబ్ ఛానెళ్లలో జరిగే చర్చా కార్యక్రమాలలో పాల్గొంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











