అల్లు అర్జున్ .. నీ పతనం మొదలైంది , ఏం చేసుకుంటావో చేసుకో : కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు ముగిసినా, కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఇంకా భగభగమండుతూనే ఉన్నాయి. టీడీపీ కూటమి వైపు ప్రజలు మొగ్గుచూపడంతో వైఎస్ జగన్ దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్నారు. ఊహించని ఫలితాలకు తోడు గతంలో పెట్టిన ఇబ్బందులు, వేధింపులు గుర్తొచ్చాయేమో కానీ టీడీపీ శ్రేణులు వైసీపీ కేడర్‌పై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అల్లర్లు , గొడవలు చోటు చేసుకుంటుండటంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. వైసీపీకి మద్ధతు పలికినవారిని ప్రముఖులను సైతం టార్గెట్ చేస్తుండటంతో వారు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే యాంకర్ శ్యామల తనకు బెదిరింపులు వస్తున్నాయని, భయమేస్తోందని వీడియో రిలీజ్ చేసింది.

ఇదిలావుండగా జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీకి చెందిన హోటల్‌పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆర్మీ దాడి దిగారు. అదేంటి కిరాక్ ఆర్పీ టీడీపీ మద్ధతుదారుడు కదా , ఎన్నికల్లో కూటమి తరపున ప్రచారం చేసిన వ్యక్తిపై బన్నీ ఫ్యాన్స్ దాడి చేయడం ఏంటి అనే అనుమానం రాకతప్పదు. దీని బ్యాక్‌గ్రౌండ్ స్టోరీలోకి వెళితే.. ఎన్నికల ప్రచార గడువు కొద్దిగంటల్లో ముగుస్తుందనగా తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్ధతు పలికేందుకు బన్నీ తన భార్యతో కలిసి నంద్యాలలో దిగారు. శిల్పా రవిని గెలిపించాలని తన అభిమానులను కోరారు.

jabardasth kiraak rp made sensational comments on icon star allu arjun

ఇది తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. సొంత మేనమామ పవన్ కళ్యాణ్ ‌పిఠాపురంలో కష్టపడుతుంటే ఓ చిన్న ట్వీట్‌తో సరిపెట్టి.. ఫ్రెండ్ వద్దకు స్వయంగా వెళ్లడాన్ని అది కూడా పవన్ కళ్యాణ్ బద్ధ వ్యతిరేకి వైఎస్ జగన్‌ పార్టీకి చెందిన వ్యక్తి ఇంటికా అంటూ మెగా, జనసేన అభిమానులు తప్పుబడుతున్నారు. అయితే ఫలితాల రోజున అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన శిల్పా రవి ఓటమి పాలయ్యారు. ఈ రిజల్ట్‌తో మెగా , పవన్ అభిమానులు మరోసారి బన్నీని ట్రోల్ చేస్తున్నారు.

ఫలితాలు విడుదలైన నాటి నుంచి వైసీపీ నాయకులు ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ వస్తున్న కిరాక్ ఆర్పీ .. శిల్పా రవికి అల్లు అర్జున్‌ సపోర్ట్ చేయడాన్ని తప్పుబట్టారు. బన్నీ గారు ఇలా చేయడం ఏం బాగాలేదండి, శిల్పా రవి మీకు మంచి స్నేహితుడు కాబట్టి మీరు సపోర్ట్ చేశారని చెప్పారు. మరి చిన్నతనం నుంచి పవన్ మంచితనం మీకు తెలియదా..? మెగా కుటుంబంలోనే కదా మీరు పెరిగింది. మీ నాన్నగారి సొంత చెల్లినే కాదా చిరంజీవి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు పవన్ మీకు బంధువే కదా. ఇన్ని తెలిసి కూడా వైసీపీ నేతలకు ఎలా సపోర్ట్ చేశారు అని ఆర్పీ ప్రశ్నించారు.

పవన్‌‌కు వ్యతిరేకంగా వైసీపీకి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు. దీనిపై మెగా ఫ్యామిలీ స్పందించకపోయినా నేను స్పందిస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఈ మాటలకు బన్నీ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. అంతే హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆర్పీకి చెందిన ''నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు '' ఔట్‌లెట్లపై దాడులు చేశారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో ఆర్పీ, అతని కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

దీనిపై కిరాక్ ఆర్పీ మరింత ఘాటుగా స్పందించారు. నేను విమర్శలు చేస్తూ మీరు ఏమైనా చేసుకోండని .. కానీ ఇంట్లో ఆడవాళ్ల జోలికి రావొద్దని అప్పుడు వైసీపీ వాళ్లకి చెప్పానని ఆర్పీ గుర్తుచేశాడు. వాళ్లలాగే అల్లు అర్జున్ ఆర్మీ వ్యవహరిస్తోందని .. అసలు ఆర్మీ ఉందో లేదో కూడా తనకు తెలియదని , ఆడవాళ్ల జోలికి వచ్చిన ప్రభుత్వం పతనమైపోయిందని కిరాక్ ఆర్పీ హెచ్చరించారు. అల్లు అర్జున్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని.. ఇలాంటి వాటిని మీరు ప్రోత్సహించొద్దని, లేదంటే మీకూ పతనం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. తాను ఎవరికీ భయపడనని, మీ పేరు అల్లు అర్జున్ అయితే నా పేరు కిరాక్ ఆర్పీ అని ఎవడి గుండె వాడికి ఉంటదని.. ఎవడి ఫ్యామిలీ వాడికి ఉంటుందని ఆర్పీ చెప్పారు.

మీకు ఇష్టమైతే తన మాటలు నమ్మండి లేదంటే ఒక గాడిద మాట్లాడిందని వదిలేసేయండి అంతేగానీ ఇంట్లో ఆడవాళ్లని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆర్పీ ప్రశ్నించారు. ఆర్మీ అంటే జనసైనికులు, ఆర్మీ అంటే టీడీపీ కార్యకర్తలు, బీజేపీ మద్ధతుదారులేనని ఆర్పీ పేర్కొన్నాడు. పట్టపగలు జై జగన్ అంటే వదిలేస్తామన్నా.. కంఠం కోసినా పర్లేదు ఆ మాట మాత్రం అనను అన్న తోట చంద్రయ్య వంటి కార్యకర్తను ఆర్మీ అంటారని చెప్పారు. సినిమాలు చేసిన పాన్ ఇండియా స్టార్ అవ్వు సంతోషిస్తానని.. మరి ఆర్మీ ఎక్కడి నుంచి వచ్చిందని , నీకున్నది అభిమానులేనని కిరాక్ ఆర్పీ చెప్పాడు. ఆర్మీల పేరు చెప్పి ఇంట్లో ఆడవాళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించాడు. ప్రస్తుతం కిరాక్ ఆర్పీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X