AP Elections 2024 రోజాను వదిలి పెట్టే సమస్యే లేదు.. కిరాక్ ఆర్పీ మాస్ ర్యాగింగ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రచారం హోరాహోరీగా జరిగింది. వైసీపీ, కూటమికి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో ఇరుపక్షాలు సర్వశక్తులను ఒడ్డాయి. ప్రచారాన్ని ఇరువర్గాలు హోరెత్తించగా.. మాటల యుద్ధం శృతిమించింది. ముఖ్యంగా జబర్దస్త్ నటులపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. దీనికి అంతే ఘాటుగా బదులిచ్చారు కిరాక్ ఆర్పీ . జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ తదితరులు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు చిన్న నటులు , చిన్న ప్రాణాలని రోజా వ్యాఖ్యానించారు. మెగా ఫ్యామిలీ ఆగ్రహానికి గురైతే ఇండస్ట్రీలో మనుగడ సాగించలేమని వారు భయపడుతున్నారని.. అందుకే పవన్ కోసం ప్రచారం చేస్తున్నారని రోజా ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కిరాక్ ఆర్పీ స్పందించారు. వాళ్లంతా చిన్న ఆర్టిస్టులైతే .. రోజాకు 15 నేషనల్ అవార్డులు, 10 ఆస్కార్ అవార్డులేమైనా వచ్చాయా అని ప్రశ్నించారు. నీకు దమ్ముంటే గెటప్ శ్రీను వేసే క్యారెక్టర్లు నీ జీవితంలో ఒక్కటైనా వేయగలవా..? సుడిగాలి సుధీర్ కష్టపడి పైకొచ్చాడని, నీకంటే 10 రెట్లు ఫాలోయింగ్ వుందని వాడితో పోటీపడగలవా , ఆదిలా గంటల తరబడి నవ్వించగలవా.. నీ బతుకులో వీరి ఛరిష్మాను చూశావా అని రోజాపై కిరాక్ ఆర్పీ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అందరికంటే ఓడిపోయేది రోజాయేనని, ఆమెకు డిపాజిట్లు కూడా రావన్నారు.

jabardasth kiraak rp satires on ap minister rk roja video goes viral

అయితే ఎన్నికలు ముగిసినా .. రోజాను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నాడు కిరాక్ ఆర్పీ. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టిన చర్చా కార్యక్రమానికి హాజరైన ఆర్పీ.. లైవ్‌లోనే రోజాను ఓ రేంజ్‌లో ర్యాగింగ్ చేశాడు. గతంలో ఆమెకు జరిగిన పుష్పాభిషేకంపై సెటైర్ల వర్షం కురిపించాడు. రోజా ఏం సాధించిందని పూలతో అభిషేకం చేస్తున్నారు.. ఆవిడకు ఏ అర్హత వుంది, ఆమె ఏమైనా చెంగాలమ్మా, నూకాలమ్మా, పోలేరమ్మా అని ఆర్పీ ప్రశ్నించారు. పూల వర్షం కురిపిస్తుంటే తనను సరిగా వీడియో తీస్తున్నారా, లెన్స్ ఎలా పెట్టారు, దీనిని స్టేటస్ పెట్టాలి, నగరి రోజా యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టాలనే టెన్షన్ ఆమెలో కనిపిస్తోందని సెటైర్లు వేశారు.

jabardasth kiraak rp satires on ap minister rk roja video goes viral

రోజాపై పూల వర్షం కురిపిస్తున్న వ్యక్తికి ఆమె పీఏ లక్షన్నర ఇచ్చి వుంటాడని.. రోజా పూలు తీసుకుని నెమ్మదిగా చల్లాలని, లేదంటే కెమెరామెన్ క్యాప్చర్ చేయలేడని రూల్స్ పెట్టారని ఆర్పీ వ్యాఖ్యానించారు. అందుకే పూలను నిదానంగా విడదీసి మరి ఆమెపై పోస్తున్నాడని.. పీఏ అతని పిర్రపై గిల్లి స్లోగా చల్లాలని గుర్తు చేస్తూ ఉంటాడని ఆర్పీ సెటైర్లు వేశాడు. ప్రస్తుతం రోజాపై పూల వర్షం , దానికి కిరాక్ ఆర్పీ విశ్లేషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే నిన్న మొన్నటిదాకా కలిసిమెలిసి ఉన్నవాళ్లు.. చెత్త రాజకీయాల వల్ల ప్రత్యర్ధులుగా మారి విమర్శలు చేసుకోవడాన్ని నెటిజన్లు ఖండిస్తున్నారు.

రోజాపై పుష్పాభిషేకం చేసిన వీడియో ఇప్పటిది కాదని తెలుస్తోంది. సీఎం వైఎస్ జగన్ తన కేబినెట్‌ను పునర్వ్యస్ధీకరించడానికి ముందు జరిగినట్లుగా తెలుస్తోంది. అప్పట్లో వడమాలపేట మండలం తట్నేరిలో ఆసియా అభివృద్ధి బ్యాంక్ అందజేసిన రూ.43 లక్షల నిధులతో పాదిరేడు-ఎల్ఎం కండిగ వయా తట్నేరి దళితవాడ రోడ్డును ఆమె ప్రారంభించారు. రోజా చేసిన కృషి ఫలితంగానే ఈ రోడ్డుకు నిధులు రావడం, నిర్మాణం వేగంగా పూర్తి కావడం జరిగిందనే అభిమానంతో స్థానికులు రోజాపై పుష్పాభిషేకం చేశారు. ఆమె తలపై తట్టలకొద్దీ రోజా పూలు చల్లి కృతజ్ఞత చాటుకున్నారు. ఈ వీడియోను రోజా అభిమాని సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X