twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు పిల్లనివ్వడం కష్టమే.. ఆ అమ్మాయి చెప్పుతో కొడుతానంది.. జబర్దస్త్‌ మహేశ్

    By Rajababu
    |

    జబర్దస్త్‌ కామెడీ షోతో గుర్తింపు పొందిన మార్వలెస్ మహేశ్ ప్రస్తుతం సినిమా పరిశ్రమలో బిజీ కమెడియన్‌గా మారాడు. జబర్దస్త్ కామెడీతో వచ్చిన పాపులారిటీతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మెగా హీరోలందరి సినిమాలలో నటించే అవకాశాన్ని చేజిక్కించుకొన్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌తో మహేశ్ మాట్లాడుతూ..

    Recommended Video

    రంగస్థలం టీజర్.. ఆరోజు రచ్చ రచ్చే ?
    రాంచరణ్ అంటే ప్రాణం

    రాంచరణ్ అంటే ప్రాణం


    సోషల్ మీడియాలో లీక్ అయిన రంగస్థలం సినిమా ఫొటోలలో రాంచరణ్‌తో కలిసి నేను కూడా ఉండటం చాలా సంతోషంగా ఉంది. అది ఫస్ట్‌లుక్ కాదు. ఆ ఫోటోలు ఎలానో బయటకు వచ్చాయి. బేసిగ్గా నాకు రాంచరణ్ అంటే చాలా ఇష్టం. ఆయన రిసీవ్ చేసుకొనే పద్దతి అదిరిపోతుంది. ఆయన నాకు ప్రాణం. అలాంటి హీరో పక్కన చేయడం అదృష్టం.

     స్టైలిష్ స్టార్ తో తప్ప..

    స్టైలిష్ స్టార్ తో తప్ప..

    ఏ జన్మలో చేసుకొన్న పుణ్యమో గానీ బన్నీ తప్పా మెగా హీరోలందరితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. జబర్దస్త్ చిత్రంలో నాగబాబుతో కలిసి పనిచేశాను. అలా అవకాశం లభించడం నిజంగా అదృష్టమే.

     మెగాస్టార్ చిరంజీవి స్వయంగా

    మెగాస్టార్ చిరంజీవి స్వయంగా

    ఖైదీ నంబర్ 150 చిత్ర షూటింగ్ చూడటానికి వెళ్లాను. అప్పుడు చిరంజీవి చూసి నీవు జబర్దస్త్ టీవీ షో చేస్తావు కదా అని అడిగాడు. మెగాస్టార్ నన్ను స్వయంగా తీసుకెళ్లి దర్శకుడు వినాయక్‌కు పరిచయం చేశాడు. డ్రైనేజీ క్లీన్ చేసే పాత్ర ఇవ్వమని చిరంజీవి సూచించాడు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటి వ్యక్తి నన్ను ఆదరించడం చాలా ఆనందమేసింది.

    పవన్ కల్యాణ్ పక్కన

    పవన్ కల్యాణ్ పక్కన

    కాటమరాయుడు చిత్రంలో పవన్ పక్కన నటించాను. ఆ చిత్రంలో నటించడం మరువలేని విషయం. జబర్దస్త్‌లో నేను కష్ణపడే విధానం చూసి లోఫర్‌లో అవకాశం ఇప్పించాడు. పూరీకి చెప్పి ఆ చిత్రంలో వరుణ్ తేజ్ పక్కన మంచి పాత్ర ఇప్పించారు. ఒక్క క్షణంలో అల్లు శిరీష్‌తో నటించాను. నిహారిక నటించిన ఒక్క అమ్మాయి చిత్రంలో మంచి పాత్ర చేశాను.

     జనానికి దూరంగా ఉండను

    జనానికి దూరంగా ఉండను

    చిన్న పాత్రానా? లేదా పెద్ద పాత్రానా అనే తేడా లేకుండా అన్ని పాత్రలు ఒప్పేసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడూ జనంలో ఉండాలి. జనానికి కనపడాలి. అప్పుడే నటుడిగా గుర్తింపు ఉంటుంది. ఒకవేళ జనాలకు దూరమైతే మనల్ని మరిచిపోతారు. దాంతో కెరీర్‌పై దెబ్బపడే అవకాశం ఏర్పడుతుంది.

    టీమ్ లీడర్ కాకపోవడమే

    టీమ్ లీడర్ కాకపోవడమే

    జబర్దస్త్ కార్యక్రమంలో ఆదికి హైపర్ అని, సుధీర్‌కు సుడిగాలి అని టైటిల్స్ ఉన్నాయి. నాకు లేకపోవడానికి కారణం నేను టీమ్ లీడర్ కాకపోవడమే. కానీ సోషల్ మీడియాలో నన్ను మార్వలెస్ మహేశ్ అంటుంటారు. జబర్దస్త్ కార్యక్రమంలో టీమ్ లీడర్లందరు ఎంతో అంతా రచయితలుగా గుర్తింపు ఉంది. నేను రచయితను కాను. నేను రాయలేను. ఎవరైనా నటిస్తే నేను కేవలం నటిస్తాను. నాకు అంత టాలెంట్ లేదు.

    నాకు అంతస్థాయి లేదు

    నాకు అంతస్థాయి లేదు

    హైపర్ ఆది, మహేశ్ కత్తి వివాదంపై మహేశ్ స్పందించాడు. వారి గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు. పెద్దగా నాకు మాట్లాడటం లేదు. ఏదో అవకాశం వస్తే చేస్తున్నాను. కష్టపడటం తెలుసు గానీ పెద్దగా ఒకరి గురించి ఆలోచించను. ఆదితో మాట్లాడుతుంటాను కానీ అన్ని విషయాలు నేను పెద్దగా చర్చించను.

    ఆర్థిక పరిస్థితి బాగుంది

    ఆర్థిక పరిస్థితి బాగుంది

    ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి బాగుంది. ఊర్లో చిన్న ఇల్లు కట్టుకొన్నాను. ఇంకా బాగుంటే మంచిగా డబ్బులు సంపాదిస్తే హైదరాబాద్‌లో ఫ్లాట్ తీసుకోవాలనుకొంటున్నాను. ఊరి నుంచి అమ్మను తీసుకురావాలనుకొంటున్నాను. అంతకంటే ఏమి లేదు. నాకు ఎవడైనా పిల్లనిస్తాడో లేదో డౌటే. ఎందుకంటే నా పేరు బాగా పాపులర్ అయిపోయింది. సినిమా వాళ్లకు పిల్లలనివ్వడం కష్టం.

    సుకుమార్ ఇంటి చుట్టూ తిరిగా

    సుకుమార్ ఇంటి చుట్టూ తిరిగా

    హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో కోకాకోలా కంపెనీలో పనిచేశాను. రాత్రి పనిచేసి పగలంతా నేను సినిమా ఆఫీసుల కోసం తిరిగే వాడిని. 2012 నుంచి సుకుమార్ ఇంటికి చాలా సార్లు వెళ్లాను. ఇప్పుడు రంగస్థలంలో అవకాశం ఇచ్చాడు. సుకుమార్ మంచి మానవత్వం ఉన్న మనిషి. ఎవరో వచ్చి పాప కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారంటే అపోలో వైద్యం చేయించాడు. ఇంటి నుంచి రావడానికి పోవడానికి ప్రయాణ ఖర్చులు కూడా ఇచ్చాడు.

    ఊర్లో కటౌట్స్ కట్టారు..

    ఊర్లో కటౌట్స్ కట్టారు..

    ఒక సినిమాలో నటించాను. ఆ విషయం ఊర్లో ఆ సినిమా విడుదలైనప్పుడు ఊర్లో కటౌట్స్ కట్టారు. తీరా చూస్తే ఆ సినిమాలో నేను లేను. దాంతో నా ఫ్రెండ్స్ నన్ను తిట్టి 3500 రూపాయలు తిరిగి ఇచ్చేయమని వార్నింగ్ ఇచ్చారు. మా అత్త కూతురుకి చెప్తే పాతిక మందిని తీసుకొని సినిమాకు వెళ్లింది. తీరా నేను తెరపై కనిపించకపోయే సరికి ఫోన్ చేసి చెడామడా తిట్టింది. మరోసారి కనీసం 15 నిమిషాలు కనిపిస్తేనే ఫోన్ చేసి చెప్పు లేదా చెప్పు తీసుకొని కొడుతా అని నా అత్త కూతురు తిట్టింది.

    English summary
    Jabardasth marvellous Mahesh become popular with Jabardasth comedy show, He said he has not had writing skills to become a team leader. He has great faith, gratitude over megastar chiranjeevi family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X