సమంత, సిద్ధార్థ ‘జబర్దస్త్’ ఫస్ట్ లుక్
హైదరాబాద్ : నందిని రెడ్డి దర్శకత్వం లో హీరో సిద్దార్థ మరియు సమంత జంటగా నటిస్తున్న సినిమాకు 'జబర్దస్త్' అనే పేరు ఖరారైన సంగతి తెలిసిందే. శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటో విడుదలైంది.

'జబర్దస్త్' చిత్రాన్ని దర్శకుడు లింగుసామి తమ తిరుపతి బ్రదర్స్ బ్యానర్ పై తమిళంలోకి అనువదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అనువాదపు హక్కులను ఆయన సొంతం చేసుకున్నారు. తమిళంలో దీనికి 'డుం డుం పీ పీ' అనే టైటిల్ ఖరారు చేశారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
వాస్తవానికి ఈచిత్రం డిసెంబర్ నెలలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ థియేటర్ల సమస్య, వరుస సినిమాల విడుదల చేపథ్యంలో విడుదలను 2013 వాయిదా వేసారు. డిసెంబర్లో బెల్లంకొండ 'గజరాజు' అనే తమిళ అనువాద చిత్రాన్ని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసారు. దీంతో థియేటర్ల సమస్య ఏర్పడింది.
సమంతా, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగు ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం : థమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బి .మహేంద్రబాబు, నిర్మాత : బెల్లంకొండ సురేష్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : బి.వి.నందినిరెడ్డి.


Click it and Unblock the Notifications











