నన్ను ఆమె పూర్తిగా వాడుకుంది: సిద్ధార్థ (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: హీరో సిద్ధార్థ, సమంత జంటగా నటించిన 'జబర్‌దస్త్' మూవీ రేపు(ఫిబ్రవరి 22) గ్రాండ్ గా విడుదలవుతున్న నేపథ్యంలో ఆ చిత్ర యూనిట్ సభ్యులు సినిమా ప్రమెషన్‌లో హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో దర్శకురాలు నందినీరెడ్డి, హీరో సిద్ధార్థ, వెలిగొండ శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్ బాబు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ...'సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. మూవీ ప్రీమియర్ షో చూసిన ప్రముఖులంతా బాగుందని మెచ్చుకున్నారు. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ సినిమాతో ఎమోషనల్‌గా అటాచ్ అవుతారు. ఇప్పటికే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. సినిమాలో ఏమైనా లోపాలుంటే అది పూర్తిగా నా వల్లే. హీరో హీరోయిన్లతో పాటు అంతా చాలా బాగా నటించారు. అందరు టెక్నీషియన్స్ నాకు బాగా సపోర్టు చేసారు' అని వెల్లడించారు.

హీరో సిద్దార్థ మాట్లాడుతూ, 'దర్శకురాలు నందినీరెడ్డి ఈ సినిమా కోసం నాలోని టాలెంట్‌ను పూర్తిగా వాడుకున్నారు. ఈ సినిమాలో ఇదివరకెప్పుడూ చూడని సిద్ధార్థను చూస్తారు. జబర్‌దస్త్ మూవీ పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సమంత ఇప్పటికే వరుసగా తెలుగులో 6 హిట్లు కొట్టింది. జబర్ దస్త్ సినిమా ఆమె ఖాతాలో చేరబోతున్న 7వ హిట్ సినిమా అని కచ్చితంగా చెప్పగలను' అన్నారు. 'అలా మొదలైంది' ఫేం నందినీరెడ్డి ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నండగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిత్యా మీనన్, సునీల్ ఈచిత్రంలో అతిపాత్రల్లో కనిపించనున్నారు. తమన్ ఈచిత్రానికి సంగీతం అందించారు.

నన్ను ఆమె పూర్తిగా వాడుకుంది: సిద్ధార్థ ( ప్రెస్‌మీట్ ఫోటోలు)

జబర్‌దస్త్ మూవీ మీడియా సమావేశంలో పాల్గొన్న దర్శకురాలు నందినీరెడ్డి, హీరో సిద్ధార్థ, వెలిగొండ శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్ బాబు తదితరులు.

నన్ను ఆమె పూర్తిగా వాడుకుంది: సిద్ధార్థ ( ప్రెస్‌మీట్ ఫోటోలు)

ఈ చిత్రానికి సెన్స్ బోర్డ్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేసారు. ఫిబ్రవరి 22న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నన్ను ఆమె పూర్తిగా వాడుకుంది: సిద్ధార్థ ( ప్రెస్‌మీట్ ఫోటోలు)

అలా మొదలైంది చిత్రాన్ని యూత్ అండ్ ఫ్యామిలీ మెచ్చేలా వినోదాత్మకంగా తెరకెక్కించిన దర్శకురాలు నందినీ రెడ్డి ‘జబర్‌దస్త్' చిత్రాన్ని మాస్ మసాలా అంశాలతో తెరకెక్కించారు.

నన్ను ఆమె పూర్తిగా వాడుకుంది: సిద్ధార్థ ( ప్రెస్‌మీట్ ఫోటోలు)

ఈ చిత్రంలో సిద్ధార్థ పాత్ర విభిన్నంగా ఉండటంతో మంచి కామెడీ టైమింగుతో ఉంటుంది. అదే విధంగా హీరోయిన్ సమంత పాత్ర రౌడీలా ఉంటుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X